విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న
సుమారు 3,795 మంది గ్రేడ్ 2 వీఆర్వోలు ప్రొబిషన్ డిక్లేర్ కోసం
ఎదురుచూస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం
రాష్ట్ర అధ్యక్షులు భూపతి రాజు రవీంద్రరాజు అన్నారు. మొన్నటి వరకు వారికి20 21
లో సర్వే ట్రైనింగ్ ఎగ్జామ్స్ నిర్వహించని కారణంగా ఇప్పటివరకు వీరికి
ప్రొబిషన్ విషయంలో ఆలస్యం జరిగిందని, ప్రస్తుతం సర్వే ట్రైనింగ్, నిర్వహించి
ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటివరకు, కొన్ని జిల్లాల్లో
జిల్లా అధికారులు కానీ మండల అధికారులు కానీ వీరి యొక్క ప్రొబిషన్ విషయంలో
చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఎగ్జామ్స్ పాస్ అయిన సుమారు 1800 వందల మందికి
ప్రొబిషన్ విషయంలో చర్యలు తీసుకోవాలని ఉన్నత స్థాయి అధికారులను కలిసి
వినతిపత్రి ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే ఫెయిల్ అయిన వారికి కూడా 13 జిఓ
అమెండ్మెంట్ చేసి వారికి కూడా న్యాయం చేయాలని కోరడం జరిగిందని, కానీ కొన్ని
జిల్లాల అధికారులు మండల స్థాయి అధికారులు ఎవరు కూడా ఇప్పటివరకు చర్యలు
ప్రారంభించలేదన్నారు. గతంలో ఉన్నత అధికారుల నుండి అన్ని జిల్లాల కలెక్టర్ లకు
13 జీవో ప్రకారం చర్యలు తీసుకోవాలని సర్కులర్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ
చాలామంది అధికారులు ఎవరు కూడా చర్యలు తీసుకోవడం లేదు. గ్రామస్థాయిలో
విఆర్వోలు ఎంతో తీవ్ర పని ఒత్తిడితో అధికారులు ఏం చెప్పినా కష్టపడి టైం తో
సంబంధం లేకుండా రాత్రులు పగలు సెలవు దినాల్లో అధికారులు ఏ పని చెబితే ఆ పని
చేస్తుంటే మా ప్రొబిషన్ విషయంలో అధికారుల వైఖరి ఇలా ఉండటం చాలా దారుణమని
ఆందోళన చెందుతున్నారు. అందువల్ల వెంటనే రాష్ట్ర ఉన్నత అధికారులు , సీఎం ఓ
అధికారులు వెంటనే గ్రేడ్ 2 వీఆర్వోల ప్రొబిషన్ విషయంలో చర్యలు తీసుకుని
వారందరికీ న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం
రాష్ట్ర అధ్యక్షులు భూపతి రాజు రవీంద్రరాజు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం
అప్పలనాయుడు కోరారు.