2020 – 21లో లబ్ధిదారుల సంఖ్య 2,98,122 సాయం రూ. 298.13 కోట్లు
2021 – 22లో లబ్ధిదారుల సంఖ్య 2,99,225 సాయం రూ. 299.23 కోట్లు
2022 – 23లో లబ్ధిదారుల సంఖ్య 3,30,145 సాయం రూ. 330.15 కోట్లు
మొత్తం రూ. 927.51 కోట్లు
అమరావతి : వరుసగా మూడో ఏడాది జగనన్న చేదోడు పథకం కింద సోమవారం ముఖ్యమంత్రి
వైయస్ జగన్ మోహన్ రెడ్డి నగదు జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,30,145
మంది అర్హులైన రజక, నాయీబ్రాహ్మణ, దర్జీ అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మలకు రూ.
330.15 కోట్ల ఆర్ధిక సాయాన్ని పల్నాడు జిల్లా వినుకొండలో సోమవారం బటన్
నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జమ
చేయనున్నారు. జగనన్న చేదోడు – షాపులున్న రజకులు, నాయీబ్రాహ్మణులు, దర్జీలకు
ఏటా రూ. 10 వేల చొప్పున నేడు అందిస్తున్న సాయంతో కలిపి ఇప్పటికే ఒక్కొక్కరికి
రూ. 30,000 వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సాయం అందించారు. సోమవారం
అందిస్తున్న సాయంతో కలిపి ఈ మూడేళ్ళలో కేవలం ఈ పథకం ద్వారా వైఎస్ జగన్ మోహన్
రెడ్డి ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 927.51 కోట్లు. లంచాలకు, వివక్షకు
తావులేకుండా అత్యంత పారదర్శకంగా, గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితా
డిస్ప్లే చేసి, సోషల్ ఆడిట్ నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక, ప్రతి ఒక్కరికీ
అర్హత ఉంటే మిస్ కాకుండా అందించాలని తపన పడుతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
ప్రభుత్వం, అర్హులై ఉండి పొరపాటున, ఏ కారణం చేతనైనా సంక్షేమ పథకాల లబ్ధి అందని
వారికి కూడా మరో అవకాశం కల్పిస్తూ జూన్, డిసెంబర్లలో లబ్ధిని వైఎస్ జగన్
మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తోంది. షాపులున్న 1,67,951 మంది టైలర్లకు రూ.
167.95 కోట్ల లబ్ధి చేకూరింది. షాపులున్న 1,14,661 మంది రజకులకు రూ. 114.67
కోట్లు, షాపులున్న 47,533 మంది నాయీబ్రాహ్మణులకు రూ. 47.53 కోట్ల లబ్ధి
చేకూరనుంది. వీరికి మంచి జరగాలని ఏటా రూ. 10 వేల ఆర్ధిక సాయం అందిస్తున్నారు.