విజయవాడ : స్థానిక 52వ డివిజన్ లోని 115వ సచివాలయం పరిధిలో 177వ రోజు శనివారం
నాడు గడప గడపకు మన ప్రభ్యుత్వం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు
వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని ఆయా ప్రాంతాలలో పర్యటించి గడప గడపకు వెళ్లి
ప్రజలకు ఈ మూడేళ్ల కాలంలో ప్రభుత్వ పరంగా జరిగిన సంక్షేమ పథకాల వివరాలు
తెలియచేస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ
అందరి సమన్వయంతో ప్రజల వద్దకు వెళ్తున్నామన్నారు.కొండా ప్రాంతంలో కొన్ని
మెట్లు కాలువల సమస్య వుంది వాటిని త్వరితగతిన అభివృద్ధి చేస్తాం అని హామీ
ఇచ్చామన్నారు. అమరావతిలో ధనికులు మాత్రమే వుండాలనే లక్ష్యంతో పేదల సొంత ఇంటి
కలను అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. ప్రజలను మోసం చేసిన వ్యక్తి
చంద్రబాబు అని అన్నారు. రాష్ట్రంలో అశాంతి సృష్టించాడనికి చంద్రబాబు
ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పై దుమ్మేయడమే పచ్చ పత్రికల
లక్ష్యం అని అన్నారు. వాళ్ళంతా ఎంత కుట్రలు చేసిన ఏమి ప్రయోజనం లేదన్నారు.ఆయన
హయాంలో ఏమి అభివృద్ది చేశాడో చర్చకు సిద్ధమా లోకేష్ నీ ప్రశ్నించారు.విజయవాడ
నగర వేదికగా చూసుకుందాం రా అని సవాలు విసిరారు. ఇరుకు సందులో పాదయాత్రలు చేసే
నైజం చంద్రబాబు,లోకేష్ లదన్నారు. ప్రజలకు నిజాలు తెలుసు అని వివరించారు.
ప్రజలకు మేలు చేసేందుకే ప్రజలలోకి వెళ్తున్నామన్నారు. వైసీపీ ప్రజలలో వున్న
పార్టీ అని అన్నారు.పోలీస్ వ్యవస్థ ను దర్బాషలాడిన అచ్చంనాయుడు పై కేసు
పెట్టాలని డిమాండ్ చేశారు. అచ్చం నాయుడు ఒక అంబోతు అని దుయ్యబట్టారు. అచ్చం
నాయుడు సిటు నుండే టీడీపీ ఓటమి మొదలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్
రాయన భాగ్యలక్ష్మి,52వ డివిజన్ వైసీపీ ఇంచార్జీ తంగెళ్ళ రాము డివిజన్ నాయకులు
కార్యకర్తలు, పలు డివిజన్ల కార్పొరేటర్లు,వివిధ కార్పొరేషన్ల
చేర్మెన్లు,డైరెక్టర్లు,పార్టీ నాయకులు, కార్యకర్తలు సచివాలయ సిబ్బంది
వాలంటరీస్, నగరపాలక సంస్థ, రెవిన్యు అధికారులు తదితర విభాగాల అధికారులు
పాల్గొన్నారు.