తిరుమల : రథసప్తమినాడు శ్రీవారి వాహన సేవలు వీక్షించేందుకు గ్యాలరీల్లో వేచి
ఉన్న భక్తులకు టిటిడి అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో నిరంతరాయంగా
అన్నప్రసాదాలు అందించారు. మొత్తం 8 లక్షల సర్వింగ్స్ చేశారు. మొత్తం 175
గ్యాలరీల్లో 62 ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. అన్నప్రసాద విభాగంలో 240
మంది సిబ్బంది, 130 మంది సులభ్ సిబ్బంది, 800 మంది శ్రీవారి సేవకులు
భక్తులకు సేవలందించారు. ఉదయం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు
నిర్దేశించిన సమయంలో భక్తులకు అన్నపానీయాలు అందజేశారు. తాగునీరు, టి,
కాఫి, పాలు, ఉప్మా, పొంగళి, పులిహోర, సాంబారన్నం, టమోటా రైస్, సాయంత్రం
సుండలు, బిస్కెట్లు భక్తులకు పంపిణీ చేశారు. భక్తులకు ఒక లక్ష మజ్జిగ
ప్యాకెట్లు అందించారు. టిటిడి అన్నప్రసాదం డెప్యూటీ ఈవో సెల్వం,
ప్రత్యేకాధికారి జిఎల్ఎన్.శాస్త్రి ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు.భక్తుల సేవలో ఆరోగ్య విభాగం

రథసప్తమినాడు టిటిడి ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో మాడ వీధుల్లోని
గ్యాలరీలతో పాటు ఇతర ప్రాంతాల్లో మెరుగైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు.
ఈ విభాగం ఆధ్వర్యంలో 1000 మంది పారిశుద్ధ్య సిబ్బంది, 600 మంది
శ్రీవారిసేవకులు సేవలందించారు. సాయంత్రం వరకు నాలుగు మాడ వీధుల్లో
పోగయిన సుమారు 40 టన్నుల చెత్తను తరలించారు. గ్యాలరీలకు అనుబంధంగా ఉన్న
మరుగుదొడ్ల వద్ద ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. టిటిడి
ఆరోగ్యశాఖాధికారి డా. శ్రీదేవి ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు.