అమరావతి : సీఎం నివాసంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని శనివారం
నాబార్డ్ చైర్మన్ షాజి కలిశారు. నాబార్డ్ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం
చేపడుతున్న వివిధ కార్యక్రమాల అమలు పై సమావేశంలో చర్చ జరిగింది. విద్య,
వైద్యం, వ్యవసాయ రంగాలలో నాబార్డ్ సాయంతో చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతంగా
ముందుకు నడుస్తున్నాయని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
నాబార్డ్ సాయంతో చేపడుతున్న విద్యారంగంలో మనబడి నాడు-నేడు కార్యక్రమం, కొత్త
మెడికల్ కళాశాలల నిర్మాణంతో పాటు వ్యవసాయ రంగంలోను చేపడుతున్న కార్యక్రమాలు
సమర్ధవంతంగా కొనసాగుతున్నాయని, వాటిని రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా
చేపడుతోందని ప్రశంసించిన నాబార్డ్ చైర్మన్. రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్య,
వ్యవసాయ రంగాల్లోనూ, మహిళా సంక్షేమంలోనూ చేపడుతున్న కార్యక్రమాలు రాష్ట్ర
ప్రజల జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపర్చడమే కాకుండా రాష్ట్ర భవిష్యత్తుకు
మంచి బాటలు వేస్తున్నాయన్న ముఖ్యమంత్రి నాబార్డు అందిస్తున్న సాయం పై సీఎం
కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా తోడ్పాటును అందించాలని
నాబార్డ్ చైర్మన్ ను సీఎం వైయస్ జగన్ కోరారు.