విజయవాడ : రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్
రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే
మల్లాది విష్ణు తెలిపారు. శనివారం 23 వ డివిజన్ 93 వ వార్డు సచివాలయం పరిధిలో
నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ డివిజన్
ఇంఛార్జి ఆత్మకూరు సుబ్బారావు, కోఆర్డినేటర్ ఒగ్గు విక్కీతో కలిసి ఆయన
పాల్గొన్నారు. దాసరి వారి వీధిలో విస్తృతంగా పర్యటించి 107 ఇళ్లను
సందర్శించారు. ప్రతి ఇంటి వద్ద ప్రజలు వారికి ఘనంగా స్వాగతం పలికారు,
దుశ్శాలువలతో సత్కరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలనలో అన్ని
వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని మల్లాది విష్ణు చెప్పారు. అర్హత ఉన్న ప్రతి
కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ఈ సందర్భంగా స్థానిక
సమస్యలపై ఆరా తీశారు. దాసరి వారి వీధిలో కొంతమేర దెబ్బతిన్న రోడ్డు
పున:నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయవలసిందిగా ఇంజనీరింగ్ అధికారులకు
సూచించారు. గత తెలుగుదేశం హయాంలో కార్పొరేటర్ నుంచి ముఖ్యమంత్రి వరకు వారి
పాలకులే ఉన్నప్పటికీ ఈ ప్రాంతాన్ని పూర్తి నిర్లక్ష్యం చేశారని మల్లాది విష్ణు
విమర్శించారు. కానీ ఈ ప్రభుత్వంలో రూ. కోట్లాది నిధులతో డివిజన్ ను సర్వాంగ
సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలియజేశారు.
కష్టజీవులకు తోడుగా ‘జగనన్న చేదోడు’
పర్యటనలో భాగంగా టైలరింగ్ చేస్తున్న అక్కచెల్లెమ్మలతో మల్లాది విష్ణు
ముచ్చటించారు. జగనన్న చేదోడు పథకం ద్వారా రజక, నాయీబ్రాహ్మణ, దర్జీ
అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ముల ఆత్మవిశ్వాసాన్ని ఈ ప్రభుత్వం మరింత పెంచిందని ఈ
సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో మొదటి, రెండు విడతలు
కలిపి 2,021 మందికి రూ. 3 కోట్ల వరకు లబ్ధి చేకూర్చడం జరిగిందన్నారు. మూడో
విడతకు సంబంధించి అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ త్వరలోనే వారి వారి వ్యక్తిగత
ఖాతాలలో నగదు జమ చేయడం జరుగుతుందని తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.