నందమూరి తారకరత్నకు బెంగళూరు నారాయణ హృదయలాయం ఆస్పత్రిలో చికిత్స
కొనసాగుతోంది. మెరుగైన వైద్యం కోసం అర్థరాత్రి కుప్పం నుంచి బెంగళూరుకు
ప్రత్యేక అంబులెన్స్‌లో తరలించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని నందమూరి
బాలకృష్ణ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబు
బెంగళూరు వెళ్లనన్నారు. చికిత్స పొందుతున్న తారకరత్నను పరామర్శించనున్నారు.
నందమూరి కుటుంబసభ్యులు కూడా బెంగళూరు వెళ్తున్నారు. కాసేపట్లో తారకరత్న హెల్త్
బులిటెన్‌ను వైద్యులు విడుదల చేయనున్నారు. నిన్న లోకేష్ యువగళంలో పాల్గొన్న
తారకరత్న.. పాదయాత్ర ప్రారంభమైన కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
వెంటన్నే కుప్పం పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. మాసివ్ స్ట్రోక్ రావడంతో
యాంజియోగ్రామ్ చేసి స్టంట్ వేసినట్లు డాక్టర్లు తెలిపారు.