23 వ డివిజన్ 93 వ వార్డు సచివాలయ పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పేదల జీవన ప్రమాణాల పెంపుదలకు వైఎస్సార్
సీపీ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నట్లు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్,
సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. శుక్రవారం 23 వ డివిజన్ 93 వ
వార్డు సచివాలయం పరిధిలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో
వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జి ఆత్మకూరు సుబ్బారావు, కోఆర్డినేటర్ ఒగ్గు
విక్కీతో కలిసి ఆయన పాల్గొన్నారు. సూర్య నారాయణ రావు వీధిలో విస్తృతంగా
పర్యటించి 194 ఇళ్లను సందర్శించారు. అన్ని వర్గాల ప్రజలతో మమేకమై పాదయాత్ర
కొనసాగించారు. డాక్టర్లు, లాయర్లు, వ్యాపారస్తులు ఇలా అన్ని వర్గాల నుంచి
సలహాలు, సూచనలను స్వీకరించారు. వీటన్నింటిపై యాక్టన్ టేకెన్ రిపోర్టును సిద్ధం
చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరుగుతుందని మల్లాది విష్ణు తెలిపారు.
మెరుగైన పాలనకు ఈ విధానం ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ సందర్భంగా స్థానికుల
నుంచి గ్రీవెన్స్ స్వీకరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి
ఆదేశించారు.
సచివాలయ పరిధిలో రూ. 2.99 కోట్ల సంక్షేమం
నవరత్నాల పథకాల ద్వారా 93 వ వార్డు సచివాలయ పరిధిలో 2 కోట్ల 99 లక్షల 2 వేల
603 రూపాయల సంక్షేమాన్ని మూడున్నరేళ్లలో అందజేసినట్లు మల్లాది విష్ణు
వెల్లడించారు. వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా ప్రతినెలా 175 మందికి క్రమం
తప్పకుండా ఇంటి వద్దకే పింఛన్ అందిస్తున్నట్లు తెలిపారు. అమ్మఒడి ద్వారా 104
మందికి రూ. 14.56 లక్షలు., విద్యాదీవెన మరియు వసతి దీవెన ద్వారా 57 మందికి రూ.
16.82 లక్షలు., చేయూత ద్వారా 70 మందికి రూ. 13.12 లక్షలు, కాపు నేస్తం ద్వారా
13 మందికి రూ. 1.95 లక్షలు, వాహనమిత్ర ద్వారా 8 మందికి రూ. 80 వేలు, జగనన్న
తోడు ద్వారా 13 మందికి రూ. 1.30 లక్షల ఆర్థిక సాయాన్ని ఒక్క ఏడాదిలోనే
అందించినట్లు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.