విజయవాడ : భారత ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన పరీక్షపై చర్చ కార్యక్రమంలో
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు. పరీక్షల ఫలితంగా
చిన్నారులో నెలకొంటున్న వత్తిడి నుండి వారిని దూరం చేసే క్రమంలో ప్రధాని ప్రతి
సంవత్సం స్వయంగా చిన్నారులతో ముచ్చటిస్తున్న కార్యక్రమానికి ఈ సంవత్సరం దిల్లీ
లోని తాల్కటోరా ఇండోర్ స్టేడియం వేదిక అయ్యింది. శుక్రవారం ఈ కార్యక్రమం జరగగా
విజయవాడ మేరీస్ స్టెల్లా కళాశాల నుండి దృశ్య శ్రవణ మాధ్యమ విధానంలో గవర్నర్ తో
పాటు రాష్ట్ర విద్యా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇంట్లో అమ్మను చూస్తే
సమయపాలన ఏలా నిర్వహించుకోవాలో మనకు తెలుస్తుందని ప్రధాని పేర్కొన్నారు.
జీవితంలో ఎదిగేందుకు దగ్గర దారులేవి ఉండబోవని, శ్రమ పడిన విద్యార్ధులు తప్పక
విజయం సాధిస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ నైపుణ్యాలను అభివృద్ది
చేసుకోవాలని, తద్వారా లక్ష్య సాధన సుసాధ్యం అవుతుందన్నారు. వివిధ పాఠశాలలుః,
కళాశాలల విద్యార్ధులతో కలిసి విజయవాడ నుండి వర్చువల్ విధానంలో పాల్గొన్న
గవర్నర్ హరిచందన్ కార్యక్రమం అనంతరం మాట్లాడుతూ ప్రధాని సూచనలను ప్రతి ఒక్కరూ
తమ విద్యా జీవితంలో అన్వయం చేసుకుని విజయం దిశగా అడుగులు వేయాలన్నారు.
చిన్నారులపై ప్రేమతో ప్రధాని ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని
నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో భాగంగా కళాశాల ఆవరణలో గవర్నర్ మొక్కలు
నాటారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, పాఠశాల విద్య
ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, పాఠశాల విద్య కమీషనర్, సురేష్,
ఇంటర్మీడియట్ బోర్డు కమీషనర్ శేషగిరిబాబు, మేరీస్ స్టెల్లా కరస్పాండెంట్
సిస్టర్ స్లల్వా తుమ్మ , ప్రిన్సిపల్ డాక్టర్ జెసింత క్వాడ్రస్, వైస్
ప్రిన్సిపల్ రామకృష్ణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.