కుప్పం : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ యువగళంపేరుతో మహాపాదయాత్రకు తొలి అడుగువేశారు. కుప్పంలోని వరదరాజస్వామిగుడిలో శాస్ర్తోక్తంగా పూజలు చేసిన అనంతరం వేలాది కార్యకర్తల జయజయధ్వానాల నడుమ చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టారు. ఉదయం 11.03 నిమిషాలకు పాదయాత్ర ప్రారంభమైంది. తొలి అడుగు వేసే సమయంలో ఆలయం వెలుపల కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. మామ బాలకృష్ణ, నందమూరి తారకత్న, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతోపాటు పొలిట్ బ్యూరో సభ్యులు, వేలాదిమంది కేడర్ వెంట నడువగా యాత్ర ప్రారంభమైంది. 400రోజులపాటు 4వేల కిలోమీటర్ల పొడవున యువగళం యాత్ర సాగనుంది.