అమరావతి : 74వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం వెలగపూడి లోని
అసెంబ్లీ భవనం ముందు జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా
పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు.ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి
పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ
శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేడు అనేక అడ్డంకులు, అవరోధాలను
అధిగమించి దేశం అన్ని రంగాల్లో ముందుకు సాగుతోందంటే అందుకు గల కారణం మన
రాజ్యాంగ స్పూర్తేనని పేర్కొన్నారు.ప్రజల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించడం
తోపాటు దేశ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్రపతి, ప్రధానమంత్రి,
ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. దేశ సమగ్రత,
సమైక్యతలను కాపాడేందుకు ప్రతి పౌరుడు కృషి చేయాల్సిన తరుణమిదని
అన్నారు.స్వేచ్చా స్వాతంత్ర్య ఫలాలు సమాజంలోని ప్రతి ఒక్కరికీ అందాలని ఆదిశగా
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విశేష కృషి చేస్తున్నాయని స్పీకర్ తమ్మినేని
సీతారాం చెప్పారు. సమాజంలోని పేదరికం పూర్తిగా పోవాలని పేదవాడు సహాయం కోసం
చేయిచాపే పరిస్థితులు లేని విధంగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు
తీసుకువెళ్ళేందుకు వీలుగా ప్రభుత్వం పనిచేస్తోందని స్పీకర్ తమ్మినేని సీతారాం
పేర్కొన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా
అమలవుతున్నాయని ఈఅభివృద్ధి మరింత ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ
కార్యక్రమంలో అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు తోపాటు రాజకుమార్,
జయరాజు,జగన్మోహన్ రావు తదితర ఉప కార్యదర్శులు, సహాయ కార్యదర్శులు,చీఫ్ మార్షల్
సహా పలువురు ఎస్పిఎఫ్ పోలీసు సిబ్బంది,అసెంబ్లీకి చెందిన ఇతర అధికారులు,
ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.