విజయవాడ : ప్రతి ఒక్కరికీ సేవ చేయాలనేదే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ
సంకల్పమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. గణతంత్ర్య
దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోము వీర్రాజు జాతీయ
పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ గణతంత్ర
దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. భారత దేశంలోనే ప్రజాస్వామ్య వ్యవస్థలు
ఉన్నాయన్నారు. మనకున్న రాజ్యాంగ వ్యవస్థ చాలా గొప్పదని, ఛాయ్ అమ్మే వారి
కొడుకుని భారత ప్రధానిని చేసిందని తెలిపారు. ఒక అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని
చేసిందని తెలిపారు. భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో
ప్రధాని ముందుకెళుతున్నారని చెప్పుకొచ్చారు. రాజ్యాంగాన్ని ఒక బాధ్యతగా
ప్రధాని మోదీపాటిస్తున్నారని అన్నారు. సోలార్ పవర్‌ను నేడు ప్రపంచ దేశాలకు
అమ్మాలని చూస్తున్నామన్నారు. మన రాజ్యాంగం వల్లే ప్రపంచంలో భారతదేశం
ప్రత్యేకంగా నిలిచిందని సోము వీర్రాజు పేర్కొన్నారు.