విజయవాడ : ఎ.పి.ఎస్.ఆర్.టి.సి ప్రధాన కార్యాలయం ఆర్టీసీ హౌస్ ఆవరణలో గురువారం
74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో సంస్థ ఎం.డి
సిహెచ్. ద్వారకా తిరుమల రావు పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం
స్వీకరించారు. రాజ్యాంగం మనకు ఎన్నో హక్కులను కల్పించిందని, కూలంకషంగా
చర్చించి ఏర్పాటు చేసిన రాజ్యాంగం వలన దేశం స్వయం సమృద్ధిని, పురోభివృద్ధిని
సాధించిందని అన్నారు. ప్రతి భారతీయుడు తలెత్తుకుని జీవించేలా డా. బి.ఆర్.
అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలుపరచిన తేదీని గణతంత్ర దినోత్సవం
జరుపుకోవడం మనందరికీ గర్వకారణమన్నారు.
సాంకేతికతను అందిపుచ్చుకుని, కొత్తగా యు టి ఎస్ ద్వారా ప్రయాణికులకు
విస్తృతమైన సేవలు అందిస్తున్నామన్నారు. ఫోన్ పే, క్యూ ఆర్ కోడ్, గూగుల్ పే,
పే టీ ఏం మొదలైన డిజిటల్ చెల్లింపుల కాగిత రహిత సేవలు ప్రవేశపెట్టబడి
ప్రయాణికులు టిక్కెట్లు పొందడం సులభతరమైనది. తద్వారా ప్రయాణికులకు,
కండక్టర్లకు చిల్లర సమస్య కూడా అధిగమించబడిందని తెలిపారు. అదనపు ఆదాయ
అన్వేషణలో భాగంగా అరుణాచలం (తమిళనాడు) మరియు మరికొన్ని ఇతర పుణ్యక్షేత్రాలకు
ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణీకుల నుండి మంచి
స్పందన కూడా రావడంతో ఇటీవల శ్రీశైలం పుణ్యక్షేత్రాలకు దర్శన టిక్కెట్లు కూడా
అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు.
ఈ సంవత్సరం ఆర్ధికంగా మనమెంతో ప్రగతి సాధించామని, కార్గో పరంగానూ, టిక్కెట్
రెవెన్యూ పరంగానూ ఆదాయం పెంచుకోగలిగామని, అదే విధంగా ఎప్పటికప్పుడు
సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ప్రయాణికులకు అవసరమైన అన్ని సౌకర్యాల కల్పనతో
పాటు, వారికి మన సంస్థ పట్ల గల నమ్మకాన్ని బలోపేతం చేసుకోవడంలో విజయం
సాధించామని పేర్కొన్నారు.
అనంతరం వివిధ విభాగాలలో ప్రతిభ చూపిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ
వేడుకలలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (అడ్మిన్) శ్రీ కోటేశ్వరరావు,
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) కే.ఎస్.బ్రహ్మానంద రెడ్డి, ఎగ్జిక్యూటివ్
డైరెక్టర్ (ఇంజనీరింగ్ ) పి.కృష్ణ మోహన్, ఆర్థిక సలహాదారు ఎన్. వి. రాఘవ
రెడ్డి, ఎ.డి (విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ) శోభామంజరి, విజయవాడ జోన్
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిడుగు వెంకటేశ్వరరావు, కమర్షియల్ ఓ.ఎస్.డి. రవి
వర్మ, కృష్ణా రీజియన్ ఆర్.ఎం ఎం.వై దానం, ఇంకా తదితర ఉన్నతాధికారులు,
ఉద్యోగులు పాల్గొన్నారు.