విజయవాడ : వారాహి ఎన్నికల ప్రచార యాత్ర తో వైసిపి పతనాన్ని శాసిస్తుందని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ అన్నారు. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వారాహితో రాష్ట్రం నడిబొడ్డున కదం తొక్కారనీ, వారాహి ఎన్నికల ప్రచార యాత్ర తో వైసిపి పతనాన్ని శాసిస్తుందనీ, వారాహి ఏవిధంగా రోడ్ల మీద తిరుగుతుందని వైసిపి నాయకులు బింకాలు పోయారనీ, ఇప్పటికైనా మీ కారుకూతలు మానుకోవాలన్నారు. మీలాంటి కుక్కలు, నక్కలు, అడ్డ గాడిదలను ప్రజలు తరిమికొడతారని, విజయవాడ నడిబొడ్డున పశ్చిమ నియోజకవర్గం నుంచి వారాహి యాత్ర ప్రారంభమైందని, సమాచారం తెలిసిన కొద్ది సమయంలో నే వేలాది మంది పార్టీ కార్యకర్తలు,అభిమానులు తరలి వచ్చారని, అడుగడుగునా మా అధినేత కు పుష్పాభిషేకాలతో ఘన స్వాగతం పలికారని చెప్పారు. పవన్ కళ్యాణ్ యాత్ర తో వైసిపి నేతల్లో వణుకు పుడుతోందని, మా కార్య క్రమానికి సహకరించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలని మహేష్ అన్నారు.