డాక్టర్ వైఎస్సార్ సంచార పశు ఆరోగ్యసేవ వాహనాలను ప్రారంభించిన సీఎం
దాదాపు రూ.240.69 కోట్ల వ్యయంతో మొత్తం 340 పశువుల అంబులెన్స్‌లు ఏర్పాటు
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
గుంటూరు : పశువులకు అంబులెన్స్ సేవలు మరింత విస్తృతంగా అందిస్తామని, రాష్ట్ర
వ్యాప్తంగా దాదాపు రూ.240.69 కోట్ల వ్యయంతో మొత్తం 340 పశువుల అంబులెన్స్‌లు
ఏర్పాటు చేసినట్లు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు.
ఇప్పటికే మొదటి దశలో రూ.129.07 కోట్ల వ్యయంతో 175 పశుఅంబులెన్స్‌ల ద్వారా
1,81,791 పశువులను ప్రాణాపాయం నుంచి రక్షించి 1,26,559 మంది పశు పోషకులకు
లబ్ధి చేకూర్చినట్లు చెప్పారు. రెండో దశలో భాగంగా రూ.111.62 కోట్ల వ్యయంతో మరో
165 పశు అంబులెన్స్ వాహనాలను బుధవారం సీఎం క్యాంపు కార్యాలయం నుంచి జెండా ఊపి
ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. డాక్టర్ వైఎస్సార్
సంచార పశు ఆరోగ్యసేవ వాహనం ఎక్కి పనితీరు, సేవలను స్వయంగా సీఎం పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక, పాడిపరిశ్రాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి డాక్టర్
సీదిరి అప్పలరాజు, ఏపీ అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎం వీ యస్ నాగిరెడ్డి, ఎంపీ
నందిగం సురేష్, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, ఎం హనుమంతరావు, లేళ్ల అప్పిరెడ్డి,
గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తాఫా, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ
ఎమ్మెల్యే మద్దాల గిరి, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు, ఇతర ప్రజా
ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.