లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతం అవ్వాలని దుర్గమ్మకి ప్రత్యేక పూజలు
విజయవాడ : రాష్ట్రం బాగు కోసం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి,
ఎమ్మెల్సీ, యువ నాయకులు, నారా లోకేష్ చేపట్టనున్న యువగళం పాదయాత్ర విజయవంతం
కావాలని మంగళవారం మోకాళ్లపై విజయవాడలోని ఇంద్రకీలాద్రి మెట్లు ఎక్కిన తెలుగు
మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మూల్పూరి సాయి కల్యాణి. అనంతరం కనకదుర్గమ్మ
వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు
పార్లమెంట్ నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి,
అంగన్వాడీ విభాగం రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ బొప్పన నీరజ, విజయవాడ సెంట్రల్
నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలు ఉదయశ్రీ, టీడీపీ నాయకులు పెందుర్తి శ్రీకాంత్,
మహిళలు, పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయి కల్యాణి మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వం
ఎన్ని అడ్డంకులు సృష్టించిన యువగళం పేరుతో నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర
విజయవంతంగా పూర్తి అవ్వాలని కోరుకుంటూ మోకాళ్లపై ఇంద్రకీలాద్రి మెట్లు ఎక్కి
మెట్లపూజ చేయడం జరిగిందన్నారు.