విజయవాడ : రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు రాష్ట్ర ప్రభుత్వం తరుపున
ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గణతంత్ర దినోత్సవ ఆహ్వానాన్ని
అందించారు. మంగళవారం సాయంత్రం రాజ్ భవన్ కు వచ్చిన సిఎస్ కు గవర్నర్ ప్రత్యేక
ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా స్వాగతం పలికారు. నగరంలోని ఇందిరాగాంధీ నగర
పాలక సంస్ధ క్రీడా ప్రాంగణంలో జనవరి 26వ తేదీ నిర్వహించనున్న 74వ గణతంత్ర
దినోత్సవ వేడుకులకు విచ్చేసి సాయిధ దళాల గౌరవ వందనం స్వీకరించి, ఆహుతులను
ఉద్దేశించి ప్రసంగించాలని జవహర్ రెడ్డి గవర్నర్ కు విన్నవించారు. రాష్ట్ర
అభివృద్దికి చిహ్నంగా అయా శాఖల శకటాలు సైతం కవాతులో పాల్గొననున్నాయని
తెలిపారు. కార్యక్రమంలో గవర్నర్ సంయిక్త కార్యదర్శి సూర్య ప్రకాష్, రాజ్ భవన్
ఉప కార్యదర్శి నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు.