ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ
విజయవాడ : బాలికల చదువు.. రక్షణ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. మంగళవారం
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ నందు రెయిన్ బో హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు
చేసిన జాతీయ బాలికల 16వ దినోత్సవ కార్యక్రమానికి మహిళా కమిషన్ చైర్ పర్సన్
వాసిరెడ్డి పద్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డిఐజి ఆఫ్ పోలీస్
కమ్యూనికేషన్ విభాగం ఎన్.ఎస్.జె లక్ష్మి, డాక్టర్ ఉమా, డాక్టర్
పి.వి.దుర్గారాణి తదితరులతో కలిసి చిన్నారులు గీసిన చిత్రపటాలను తిలకించి
చిన్నారులను అభినందించి, పోటీలలో పాల్గొన్న విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ
సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఇందిరాగాంధీ భారత తొలి మహిళా ప్రధానిగా ప్రమాణం
చేసిన రోజును బాలిక దినోత్సవంగా జరుపుకుంటున్నాం. బాలికల ప్రాముఖ్యతను దేశము,
ప్రపంచం గుర్తిస్తుంది. నేడు ప్రతి రంగంలో మహిళలు రాణిస్తున్నారు. బాలికల
ప్రాముఖ్యత సమాజంలో సమానత్వం కోసం పోరాడుతున్న నేపథ్యంలో అనేక రకాల
వేధింపులు, వెనుకబాటుతనం జరుగుతుందన్నారు. జాతీయస్థాయిలో మహిళా మలయోధులు,
ఐపీఎస్ అధికారులు కూడా వేధింపులు గురైన సందర్భాలు అనేకం ఉన్నాయి అన్నారు.
మార్పు రావాలంటే ప్రతి ఇంటి నుంచి చైతన్య రావాలని అప్పుడే మార్పు
సాధ్యమన్నారు. ఆడపిల్లల ఆకాశమే హద్దుగా ప్రయాణిస్తున్నారని, వారికి అండగా
సమాజం సీరియస్ గా స్పందించాలన్నారు. ఆడపిల్లలు సమాజానికి అద్భుతమైన సంపదని,
వారికి రక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. చదువు, రక్షణ చిన్నారి దశ నుంచి
ప్రారంభం కావాలని, బాలికల సంబంధించి అనేక అంశాల్లో సమగ్ర అభివృద్ధి కోసం
ప్రణాళిక బద్ధంగా ముందడుగు వెయ్యాలన్నారు. బాలికలకు సంబంధించి చదువు,రక్షణ
అనేక అంశాల్లో మార్పులు జరగాలన్నారు.
ఇందుకు సంబంధించి మహిళా కమిషన్ ప్రభుత్వానికి అనేక సూచనలు చేసిందని ఈ
సందర్భంగా గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చదువు, రక్షణ
విషయంలో అధిక ప్రాధాన్యత నిస్తుందన్నారు. మహిళల రక్షణ విషయంలో కఠినమైన చట్టాలు
చేసిందన్నారు. కార్యక్రమంలో పలు స్కూల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు రెయిన్
బో హాస్పిటల్ సిబ్బంది ఉన్నారు. అనంత నిర్వాహకులు అతిధులను ఘనంగా సన్మానించారు.