ఏలూరు ఎమ్మెల్యే, ఏలూరు జిల్లా వైఎస్సార్ సిపి
అధ్యక్షులు ఆళ్ల నాని సమావేశంఏలూరు : రాష్ట్రంలోని పేద ప్రజల జీవితాల్లో ఆనందాలు నింపుతూ సంక్షేమ పాలనతో
వారికి అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనను ప్రజలకు
మరింత చేరువ చేస్తూ క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని మాజీ
ఉపముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే, ఏలూరు జిల్లా వైఎస్సార్ సిపి అధ్యక్షులు ఆళ్ల
నాని ఏలూరు నియోజకవర్గ పార్టీ నాయకులకు సూచించారు.
రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ కేంద్ర కార్యాలయం
ఆదేశాల మేరకు ఏలూరు నియోజక వర్గంలో ఇటీవల సచివాలయ కన్వీనర్లను నియమించడం
జరిగిందని, వారితో పాటు గృహ సారథులు నియామకం కూడా చేపట్టి తుది జాబితాను
పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించడం జరిగిందని ఆళ్ల నాని తెలిపారు. ప్రజా
సేవ పట్ల తపన, పార్టీ పట్ల అంకితభావం కలిగిన వారికి గృహ సారధులుగా
నియమించినట్లు, ప్రతి 50 ఇళ్లకు స్థానికంగా ఉండే ఒక మహిళతో కూడిన ఇద్దరు గృహ
సారధుల బృందాన్ని ఏర్పాటు చేస్తూ చర్యలు చేపట్టామని ఆళ్ల నాని అన్నారు.
ఫిబ్రవరి మొదటి వారంలో 3,4,5 తేదీల్లో ఏలూరులోని సారధి గార్డెన్స్ లో ఏలూరు
నియోజక వర్గ పరిధిలోని జగనన్న సచివాలయ కన్వీనర్లు తో పాటు నూతనంగా నియమించ
బడిన క్లస్టర్ గృహ సారథులకు, వాలంటీర్లకు ఆత్మీయ సమావేశం నిర్వహించటం
జరుగుతుందని ఆళ్ల నాని తెలిపారు. పార్టీ కోసం నిస్వార్ధంగా సేవలు అందించే
ప్రతి ఒక్కరికి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఆళ్ల నాని అన్నారు. జగనన్న
సంక్షేమ పాలనపై ఓర్వలేక ప్రతి పక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలను సమర్ధవంతంగా
తిప్పికొట్టేలా ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో ప్రత్యేక
చొరవ చూపాలని ఆళ్ల నాని సూచించారు. ఈ సమావేశంలో నగర డిప్యూటీ మేయర్లు గుడిదేసి
శ్రీనివాస్, నూకపెయ్యి సుధీర్ బాబు, మార్కెట్ యార్డ్ చైర్మన్ నెరుసు
చిరంజీవులు, మాజీ చైర్మన్ మంచెమ్ మైబాబు, వైఎస్సార్ సిపి సీనియర్ నాయకులు
బలరాం, కో-అప్షన్ సభ్యులు పెదబాబు, మున్నుల జాన్ గురునాధ్, కార్పొరేటర్
యర్రంశెట్టి సుమన్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కోరాడ బాబు, వైఎస్సార్ సిపి
నాయకులు పొడిపిరెడ్డి నాగేశ్వరరావు, కొల్లిపాక సురేష్, నిడికొండ నరేంద్ర, తోట
సుధీర్, నున్న కిషోర్,భారతి వెంకట రావు తదితరులు పాల్గొన్నారు.