ఎంపీ నందిగం సురేష్
గుంటూరు : చంద్రబాబు, రామోజీలు ఏనాడైనా బడుగు బలహీన వర్గాలపై ప్రేమ చూపించిన
దాఖలాలు లేవు. వారు ఎప్పుడూ దళితులను, గిరిజనులను చిన్నచూపే చూశారు. ఎస్సీలంటే
ఎప్పుడూ చిన్నచూపుతోనే ఉండే వారికి ఇప్పుడు ఆకస్మాత్తుగా ఎస్సీలు
గుర్తుకువచ్చారు, లేని ప్రేమను ఒలకబోస్తున్నారు. టీడీపీ హయాంలో ఎస్సీ ఎస్టీ
సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించి, ఇతర పథకాలకు వాడినప్పుడు ఈనాడు
రామోజీకి ఇలాంటి రాతలు రాయాలనిపించలేదు. టీడీపీ హయాంలో 2018-19 ఎస్సీ సబ్
ప్లాన్ ను తీసుకుందాం. ఇందులో 9వ ఐటమ్ చూడండి.. పొలం బడి అని ఉంది. అలాగే,
12,13 ఐటమ్స్ పొలం పిలుస్తోంది. చంద్రన్న రైతు క్షేత్రాలు అని పెట్టారు.
అలాగే, డ్వాక్రా మహిళలకు ఇచ్చిన శానిటరీ నాప్ కిన్లు, సామాజిక పెన్షన్లు..
ఇవన్నీ ఎస్సీ సబ్ ప్లాన్ లోనే చేర్చేశారు. అంతేకాకుండా, ఎన్టీఆర్ సుజల
స్రవంతిని కూడా ఎస్సీ సబ్ ప్లాన్ లో భాగం చేసేశారు. చంద్రన్న పెళ్ళి కానుక,
ఎన్టీఆర్ ఉద్యోన్నతి, మా ఇంటి మహాలక్ష్మి, పిల్లలకు పౌష్టికాహారం, అన్న
అమృతహస్తం అంటూ ఇలా ప్రతి పథకాన్నీ టీడీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్
కాంపొనెంట్ లో భాగంగా చూపింది. మరి టీడీపీ హయాంలో ఇలాంటి వార్త రాయాలని
అనిపించని ఈనాడు, రామోజీ ఇప్పుడు పెన్షన్లు, గోరుముద్దల ఖర్చులు కూడా సబ్
ప్లాన్ లోనే వేసేశారు, ఇది తప్పు అంటూ నిన్న బ్యానర్ వేసేశారు. అంటే దీని
అర్థమేమిటి..?, ఏ సామాజికవర్గం మీద ప్రేమ?. ఎస్సీ, ఎస్టీల మీద ప్రేమ అంటారా..
లేక.. ఎస్సీ, ఎస్టీలంటే రామోజీ- చంద్రబాబు, మేమే ఎస్సీలం, మేమే ఎస్టీలం
అంటారా..? ఎం చంద్రబాబు తన ఐదేళ్ల కాలంలో ఎస్సీలకు కేవలం 33 వేల కోట్ల రూపాయలు మాత్రమే
ఖర్చు చేశారు. అదే, జగన్మోహన్రెడ్డి ఈ మూడున్నరేళ్లలోనే ఎస్సీల సంక్షేమం
కోసం రూ.48 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారు.
టీడీపీ, రామోజీ రాతలనే పవన్ కళ్యాణ్ వళ్లిస్తాడు
-ఎస్సీల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు అన్న చంద్రబాబును పవన్ కళ్యాణ్
పశ్నించాలి కదా..?. అలా ప్రశ్నించకపోగా, ఆయన చంకనెక్కి నీతులు చెబుతాడు.
-పవన్ టీడీపీ వారు ఇచ్చే స్క్రిప్ట్ చదవడం మానేసి, తన సొంతగా ఏదైనా ఎజెండా
ఉంటే మాట్లాడితే బాగుంటుంది.
-టీడీపీ, రామోజీ రాసే రాతలే పవన్ మాట్లాడుతున్నాడు
-లోకేష్ ఖాళీగా ఉండి ఏం చేస్తాడు…పాదయాత్ర చేసుకోనివ్వండి.
-ఆయన్ను అడ్డుకోడానికి లోకేష్ ఏమీ పెద్ద పనోడు అయితే కాదు
– లోకేష్ పాదయాత్ర వల్ల వాళ్ళ పార్టీలో మార్పు సంగతి ఏమోగానీ, శరీరంలో మార్పు
వస్తుందేమో.