అదే ఆయనకిచ్చే నిజమైన నివాళి
విజయవాడ : లాటిన్ అమెరికా విప్లవ యోధుడు చేగువేరా కుమార్తె, మనమరాలు భారతదేశ
పర్యటనలో భాగంగా విజయవాడలో ‘‘క్యూబా సంఫీుభావ సభ’’ ఈ రోజు (23 జనవరి, 2023)
సాయంత్రం 6 గంటలకు మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రం (ఆడిటోరియం)లో
జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథులుగా డా॥ అలైదా గువేరా, చేగువేరా కుమార్తె,
ప్రొ॥ ఎస్తోఫానియా, చేగువేరా మనుమరాలు మరియు వివిధ పార్టీల రాజకీయ నాయకులు
పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుమార్తె అల్తెదా గువేరా మాట్లాడుతూ మీ అందరూ
క్యూబా కు సంఘీబావం తెలపడం ఆనందంగా ఉందన్నారు. నేను అనే కన్నా మనం అంటే
ఆనందంగా ఉందన్నారు. కలిసి ఉంటే ఎన్ని విజయాలన్తెనా సాధించవచ్చన్నారు. చేగువేరా
లక్ష్యం టిషర్టు ప్తె మోటార్ సైకిళ్ళ ప్తె వేస్తే సరిపోదని పోరాటాల రూపంలో
పేదలకు అండగా ఉన్నప్పుడే ఆయన లక్ష్యం నెరవేరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో
తొమ్మిది వామపక్షాల నాయకులు టిడిపి, వ్తెసిపి, నాయకులు మాట్లాడారు.