మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని
మచిలీపట్నం : అర్హులైన పేదలందరి సొంతింటి కలను గొప్ప లక్ష్యం నిబద్ధతతో
ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నెరవేరుస్తున్నారని మాజీ మంత్రి, వైయస్సార్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య
(నాని) పేర్కొన్నారు. మచిలీపట్నం మండలం కరగ్రహారం గ్రామంలో మెగా హౌసింగ్
గ్రౌండింగ్ మేళ ‘ నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు’ కార్యక్రమంలో భాగంగా
వైఎస్ఆర్ జగనన్న కాలనీలో 2,5,6 డివిజన్లకు సంబంధించి లబ్ధిదారులతో నూతనంగా
నిర్మిస్తున్న -ఇళ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పేర్నినాని సోమవారం శంకుస్థాపన
చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులతో అద్దె ఇంట్లో నానా
అగచాట్లు పడిన వారికి మాత్రమే స్థలం విలువ బాగా తెలుస్తుందని అన్నారు.
మచిలీపట్నం నియోజవర్గంలో పేదలందరికీ ప్రభుత్వం ఇళ్లు మెగా గ్రౌండింగ్
డ్రైవ్‌ను చేపట్టిందన్నారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో కరగ్రహారంలో ఏ
సెక్టార్ లో మొత్తం 757 ప్లాట్లలో సోమవారం 2,5,6 డివిజన్ల సచివాలయ పరిధిలో 105
మంది లబ్ధిదారులకు సంబంధించి ఇండ్లకు సామూహిక శంకుస్థాపనలు ఎంతో ఘనంగా జరగడం
ఎంతో సంతోషంగా ఉందన్నారు.
సామూహిక శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జాయింట్
కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, మచిలీపట్నం నగర పాలక సంస్థ మేయర్ మోకా
వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ లంకా సూరిబాబు, మచిలీపట్నం మాజీ మున్సిపల్
చైర్మన్ షేక్ సలార్ దాదా, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ బొర్రా విఠల్, డ్వామా
పిడి జీవి సూర్యనారాయణ, మచిలీపట్నం ఆర్డీవో ఐ కిషోర్, డిఆర్డిఏ పిడి, మెప్మా
ఇన్చార్జి పిడి పిఎస్ఆర్ ప్రసాద్, తహశీల్ధార్ సునీల్ బాబు, మచిలీపట్నం
నగరపాలక సంస్థ కమీషనర్ చంద్రయ్య, 2 వ డివిజన్ కార్పొరేటర్ పరింకాయల విజయ్
చందర్,5 వ డివిజన్ కార్పొరేటర్ వేముల గాంధీ, 6 వ డివిజన్ కార్పొరేటర్ పర్ణం
సతీష్, పలువురు అధికారులు,50 డివిజన్లకు సంబంధించిన కార్పొరేటర్లు
కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది పెద్ద ఎత్తున
పాల్గొన్నారు.