పార్టీ ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నాయకుల సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, డిప్యూటి సిఎం అంజాద్ బాషా
గుంటూరు : ముస్లిం మైనారిటీల సంక్షేమం చూడటంతో పాటు వారికి అన్ని విధాలా రక్షణ కల్పించి భరోసా ఇచ్చే పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం నాడు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ముస్లింల సంక్షేమం, వారి అభివృద్దికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, డిప్యూటి సిఎం అంజాద్ బాషా, పార్టీ శాసనసభ్యులు హఫీజ్ ఖాన్, శాసనమండలి సభ్యులు ఇక్భాల్, ఇషాక్ బాషా, రుహుల్లా, ముస్లిం ఎఫైర్స్, సంక్షేమం సలహాదారులు ఎస్ ఎం జియాఉధ్దీన్, హబీబుల్లాలతోపాటు వక్ఫ్ బోర్డు ఛైర్మన్ ఖాదర్ భాషా, పార్టీ కేంద్ర కార్యాలయం పర్యవేక్షకులు, శాసనమండలి సభ్యులు లేళ్ళ అప్పిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ముస్లిం మైనారిటీల అభివృద్ధికి దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి అనేక చర్యలు తీసుకున్నారని తెలిపారు.అదే బాటలో వైయస్ జగన్ కూడా ముస్లిం మైనారిటీల రాజకీయ, సామాజిక, ఆర్దిక అభివృద్ధికి దోహదం చేసే అనేక పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నారన్నారు. ముస్లిం సోదరులు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, జగన్ లపై ఎనలేని ఆప్యాయత, ప్రేమ కనబరుస్తున్నారని అన్నారు. వైయస్ జగన్ ముస్లిం కుటుంబాలను అభివృద్ది పధంలోకి తీసుకువచ్చేందుకు నిత్యం కృషి చేస్తున్నారన్నారు.