విజయవాడ : నిజమైన జాతీయవాదిగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు భారతదేశం పట్ల ఉన్న
ప్రేమ, దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఘించదగినదని ఆంధ్రప్రదేశ్ గవర్నర్
బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. భారత జాతికి బోస్ అందించిన నిస్వార్థ సేవను
దేశం ఎప్పటికీ మరువదన్నారు. విజయవాడ రాజ్‌భవన్ దర్బార్ హాల్లో సోమవారం
జరిగిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. నేతాజీ
చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన గవర్నర్, ఇప్పటికీ దేశంలోని
అనేకమంది ప్రజల హృదయాల్లో నేతాజీ జీవించే ఉన్నారన్నారు. ముఖ్యంగా యువతకు
నేతాజీ చరిత్ర కష్టనష్టాలను ఎదుర్కొనేందుకు అవసరమైన ధైర్యాన్ని
అందిస్తుందన్నారు. సాహసంతో నేతాజీ అడుగుజాడల్లో యువత నడవాలన్నారు. నేతాజీ
సుభాష్ చంద్రబోస్ ” మీరు రక్తం చిందించండి, నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను”,
“జై హింద్” అన్న నినాదాలతో దేశంలోని యువకులను స్వాతంత్ర్య ఉద్యమం వైపు
ప్రేరేపించారన్నారు. మహాత్మా గాంధీని “జాతి పితామహుడు” అని పిలిచిన మొదటి
నాయకుడు కూడా నేతాజీ మాత్రమేనని గవర్నర్ గుర్తు చేసారు. వెలకట్టలేని ఆయన
సేవలకు గుర్తుగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఇండియా గేట్ వద్ద నేతాజీ
సుభాష్ చంద్రబోస్ విగ్రహాం ఏర్పాటు కావటం దేశ ప్రజలకు ఎనలేని గర్వకారణమని
గవర్నర్ హరిచందన్ ప్రస్తుతించారు. నేతాజీకి ఘన నివాళి అర్పిస్తూ జనవరి 23ను
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పరాక్రమదివస్ గా ప్రకటించిందన్నారు. ఈ
కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా, రాజ్ భవణ్
సంయిక్త కార్యదర్శి సూర్య ప్రకాష్, ఉప కార్యదర్శి నారాయణ స్వామి, రాజ్‌భవన్
అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.