విజయవాడ : సీఎం జగన్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచినా ఏమి సాధించారో
చెప్పాలని విద్యార్థి యువజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. విజయవాడలో సమర
యాత్రకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య
బద్ధంగా నిరసనలు తెలపాలంటే హైకోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం
చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం విద్యార్థి యువజన సంఘాలు చేపట్టిన సమరయాత్రకు
ఎట్టకేలకు డీజీపీ నుంచి అనుమతి లభించిందని తెలిపారు. విజయవాడలో సమర యాత్రకు
సంబంధించిన గోడ పత్రికను విద్యార్థి యువజన సంఘాల నాయకులు ఆవిష్కరించారు. ఈ
సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలను అమలు చేయకుండా
కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. విభజన హామీలు,
ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి
వచ్చి నాలుగేళ్లు గడిచినా ఏమి సాధించారో చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం వద్ద తాకట్టు పెట్టారని
మండిపడ్డారు. జనవరి 25 నుంచి మార్చి 4వ తేదీ వరకు హిందూపురం నుంచి ఇచ్చాపురం
వరకు సమరయాత్ర పేరుతో బస్సు యాత్ర చేపట్టామని యాత్రకు ఎట్టకేలకు అనుమతి
ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలపాలంటే
హైకోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.