గుంటూరు : అమరావతిలో కేంద్ర సంస్థలకు ఇచ్చిన భూములలో వెంటనే పనులు
ప్రారంభించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అమరావతి రైతులు, కేంద్ర
మంత్రికి విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి పర్యటనకు వచ్చిన కేంద్ర
ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పరివార్ ను రాజధాని రైతులు కలిశారు.
గుంటూరు జిల్లా మంగళగిరి పర్యటనకు వచ్చిన కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ
ప్రవీణ్ పరివార్ ను రాజధాని రైతులు కలిశారు. అమరావతిలో కేంద్ర సంస్థలకు ఇచ్చిన
భూములలో వెంటనే పనులు ప్రారంభించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని రైతులు
విజ్ఞప్తి చేశారు. ఆ స్థలాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేలా కేంద్ర సంస్థలతో
రాష్ట్రంపై ఒత్తిడి తీసుకొచ్చేలా కృషి చేయాలని కోరారు. తాము ఐదు కోట్ల ప్రజల
కోసం భూములు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం తమను మూడు రాజధానుల పేరుతో మోసం చేసిందని
మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వచ్చే పార్లమెంట్ సమావేశాలలో అమరావతి తరఫున గళం
ఎత్తాలని రైతులు మంత్రికి విజ్ఞప్తి చేయగా ఆమె సానుకూలంగా స్పందించారు. ముందు
కేంద్ర సంస్థలకు ఇచ్చిన స్థలాలపై అధికారులతో త్వరలోనే సమీక్ష
నిర్వహిస్తానన్నారు. మరో పది రోజుల్లో రాజధాని ప్రాంతంలో పర్యటిస్తానని మంత్రి
రైతులకు చెప్పారు.