విజయవాడ : ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక చట్టాన్ని పొడిగిస్తూ ఆంధ్ర ప్రదేశ్
ప్రభుత్వం ఈ రోజు ఆర్డినెన్సు తీసుకు రావడం పట్ల ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్
పార్టీ హర్షం వ్యక్తం చేస్తున్నది. రాష్ట్రంలోని దళిత గిరిజన సంఘాలు, పలు
రాజకీయ పక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై వత్తిడి తీసుకు
వచ్చినందుకు ప్రభుత్వం దిగివచ్చి ఈ ఆర్డినెన్సు ఇచ్చింది. ఇది దళిత గిరిజన
శక్తుల పోరాట విజయంగా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తున్నదన్నారు. వచ్చే
అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ ఎస్టీ స్పెషల్ డవలప్మెంట్ ఫండ్ పేరుతో
కట్టుదిట్టమైన చట్టం తీసుకురావడంతో పాటు ఎస్సీ ఎస్టీ లకి కేటాయించే నిధులను
దారి మల్లించకుండా కఠిన చర్యలు తీసుకుంటూ తగిన సవరణలతో చట్టాన్ని
తీసుకురావాలని ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ సూచిస్తున్నదన్నారు. ఈ
ఆర్డినెన్సు తెచ్చిన విధంగానే ప్రభుత్వం నిలిపివేసిన 27 సంక్షేమ పథకాలను
పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నదని పేర్కొన్నారు.