తాడేపల్లిగూడెం : గుడికి వచ్చే భక్తుడు దేవుడి తర్వాత కొలిచేది అర్చకుడినేనని
అంతటి ప్రాశస్త్యం కలిగిన అర్చకులు తమ గౌరవాన్ని మరింత ఇనుమడింప చేసే విధంగా
వ్యవహరించాలని అర్చకులు అభ్యున్నతికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ
అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని మాగంటి ఫంక్షన్ హాల్ లో
ఆదివారం ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పరిధిలోని ఐదు జిల్లాల కు చెందిన అర్చకులకు
అర్చక ట్రైనింగ్ అకాడమీ నిర్వహణలో ఆగమ శిక్షణ తరగతులు అవగాహన సదస్సు జరిగింది.
అతి ప్రాచీనమైన సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించడంలో అర్చకుల పాత్ర అత్యంత
కీలకమైనదని మంత్రి కొట్టు సత్యనారాయణ ఉద్ఘాటించారు. తాను దేవాదాయ మంత్రిగా
బాధ్యతలు స్వీకరించే నాటికి శాఖ పై ఉన్న అవినీతి మచ్చను చెరిపి వేసేందుకు అనేక
సంస్కరణలు ప్రక్షాళన చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. దేవాదాయ శాఖలో అనేక సమస్యలు
లిటిగేషన్లు కోర్టు కేసులు ఉన్నాయని గుర్తించి వాటి పరిష్కారానికి ప్రతి
మంగళవారం క్రమం తప్పకుండా దేవాదాయ శాఖ సమీక్ష సమావేశం నిర్వహిస్తూ సమస్యలు
పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దీనికోసం ప్రతి సోమవారం
జిల్లా అధికారి కార్యాలయంలో స్పందన నిర్వహిస్తూ ఆ జిల్లా పరిధిలోని దేవాదాయ
శాఖకు సంబంధించిన సమస్యలపై ఫిర్యాదులు స్వీకరిస్తూ వాటి పరిష్కారానికి కృషి
చేయడం జరుగుతుందన్నారు. అర్చకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన
కోరారు. తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక అర్చకుల జ్ఞాన సంపత్తిని
పెంపొందించేందుకు అర్చక సమాఖ్యను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ధార్మిక పరిషత్
ను కూడా పూర్తిస్థాయిలో పునరుద్ధరించామన్నారు. పూజలు హోమాలు యజ్ఞ
యాగాదులు వంటివి చేయడం ద్వారా ఆలయాల అభివృద్ధికి అర్చకులు పాటుపడాలన్నారు
గతంలో పదివేల లోపు వేతనాలు ఉండే అర్చకులకు తాము వచ్చాక 10000 చేసామని అలాగే
10 నుంచి 15000 లోపు ఉండే వారికి 16,500 రూపాయలు చేశామని మంత్రి కొట్టు
సత్యనారాయణ తెలియజేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఐదు లక్షల రూపాయల లోపు ఆదాయం
కలిగిన ఆలయాలను అర్చకులకే అప్పగించే దిశగా ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు.
వంశపారంపర్య అర్చకత్వానికి సంబంధించి అర్చకుల కుటుంబాల్లో 16 సంవత్సరాలు వయసు
నిండిన వారి పిల్లలకు అవకాశం కల్పిస్తూ చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. అయితే
వారు అర్చక ట్రైనింగ్ అకాడమీ నిర్వహించే ఆగమ పరీక్షలు ఉత్తీర్ణులై అవకాశం
పొందవలసి ఉంటుంది అన్నారు. శ్రీశైలం దేవస్థానానికి సంబంధించి ఎన్నో తరాలుగా
అపరిష్కృతంగా ఉన్న సమస్యను రెవిన్యూ అటవీ శాఖ మంత్రులు సహకారంతో పరిష్కరించడం
జరిగిందన్నారు. 4800 ఎకరాల భూమిని ఆలయానికి స్వాధీనం చేస్తూ సరిహద్దులు
వేస్తున్నామన్నారు. అర్చకులు వారి వారి సమస్యలను ఎప్పుడైనా
తన దృష్టికి తీసుకు రావచ్చునని వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రభుత్వం
కృషి చేస్తుందని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలియజేశారు.