కొవ్వూరు: కొవ్వూరు నియోజకవర్గంలోని చాగల్లు మండలం దారవరం గ్రామంలో 82 వ రోజు
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి తానేటి
వనిత పాల్గొన్నారు. స్థానిక వైస్సార్సీపీ నాయకులు, వివిధ శాఖల అధికారులు,
సచివాలయ సిబ్బంది తో కలిసి గ్రామంలోని ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ సంక్షేమ
పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా గ్రామంలోని స్కూల్ విద్యార్థులతో
హోంమంత్రి ముచ్చటించారు. విద్యార్థులందరికీ అమ్మఒడి పథకం వస్తుందా లేదా అని
స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అమ్మవడి ఎవరు ఇస్తున్నారని హోంమంత్రి వనిత
విద్యార్థులను అడుగగా సీఎం జగన్ ఇస్తున్నారని సమాధానం ఇచ్చారు. విద్యార్థులు
బాగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలనే సదుద్దేశంతోనే సీఎం జగన్
అమ్మవడి ఇస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థి చక్కగా చదువుకొని
జీవితంలో మంచి స్థానాలకు చేరుకోవాలని స్కూల్ విద్యార్థులకు హోంమంత్రి తానేటి
వనిత సూచించారు.