రాజమండ్రి : రహదారి పనులు వేగవంతంగా ఎందుకు కావడం లేదని కాంట్రాక్టర్
చిలువూరి సూర్యనారాయణ రాజుని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ప్రశ్నించారు.
ఆదివారం కంబాల చెరువు నుండి గామన్ ఇండియా అండర్ బ్రిడ్జి వరకూ 5.6 కిలోమీటర్ల
మేర రూ.3.56 కోట్లతో రహదారి నిర్మాణ పనులు చేపట్టాలి. ఈ పనులను ఆరు నెలల
క్రితం ప్రారంభించి కేవలం రెండు కిలోమీటర్ల పొడవునా ఒకవైపు చేసిన కాంట్రాక్టర్
ఆ పై ఎందుకనో వేగవంతం చేయడం లేదు. ఆదివారం అటుగా వెళ్లిన ఎంపీ తన వాహనాన్ని
రాజా థియేటర్ వద్ద ఆపి పనులు పరిశీలించారు. ఆ సమయంలో పనులు జరగడం లేదు.
వెంటనే సదరు కాంట్రాక్టర్ సూర్యనారాయణ రాజును పిలిచి పనులు ముందుకు సాగడం
లేదేమని ఎంపీ ప్రశ్నించారు. త్వరితగతిన పూర్తి చేయమని ఆదేశించారు. ఆలస్యం
కావడానికి వీల్లేదని, ఎప్పట్లోగా పూర్తి చేస్తావని ప్రశ్నించారు. ఆర్థిక
సమస్యలు కారణంగా ఆగిపోయాయని, నెల రోజుల్లోగా పూర్తి చేస్తానని కాంట్రాక్టర్
సూర్యనారాయణ రాజు ఎంపీ భరత్ కు హామీ ఇచ్చారు.