కడప: ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు సంతృప్త స్థాయిలో అందుతున్నాయని, ఇది
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పారదర్శక పాలనకు అద్దం పడుతోందని రాష్ట్ర
ఉపముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ బాషా అన్నారు. నగరంలోని 41 వ డివిజన్ రవీంద్ర
నగర్ సచివాలయం-1 పరిధిలో డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, ఇంచార్జి ఎస్.
జమాల్ వల్లి ల ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమాన్ని రాష్ట్ర
ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖామంత్రి అంజాద్ బాషా
నిర్వహించారు
83 వ రోజైన గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి కి
అభిమానులు,నగర ప్రజానీకం, మహిళలు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర
ప్రభుత్వం పేద ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏవిధంగా ప్రజలకు
చేరుతున్నాయని ఉపముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. స్థానిక కార్పొరేటర్,
నాయకులు, అధికారులతో కలిసి ఆయా వీధుల్లో నివాసాలన్నింటినీ తిరిగారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వారికి
వివరించి,వార్డు లోని అన్ని ఇళ్లకు తిరుగుతూ కుటుంబాలను కలుసుకోవడంతో పాటు,
వారు పొందుతున్న లబ్ధి సమాచారంతో కూడిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్
రెడ్డి సంతకం చేసిన బుక్ లెట్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి కుటుంబం
లబ్ది చేకూరిందని ప్రభుత్వ పాలనపై సంతృప్తి వ్యక్తం చేయగా. పలువురు తమ
సమస్యలను అంజాద్ బాషా దృష్టికి తీసుకురాగా వెంటనే పరిష్కరించాలని సంబందిత
అధికారులకు ఆదేశించారు.
రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయంగా ముఖ్యమంత్రి
పనిచేస్తున్నారన్నారు.దేశంలో ఎక్కడా లేని విధంగా కుల,మత, పార్టీలకతీతంగా అర్హత
ఉన్న పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్
మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల
ద్వారా ఏదో ఒక పథకం ద్వారా ప్రతి గడపకు లబ్ది చేకూరిందని లబ్ధిదారులు ఆనందం
వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి తోపాటు, స్టేట్ ఆర్టీ కల్చర్
అడ్వైజరీ బోర్డ్ ఛైర్మెన్ సంబటూరి ప్రసాద్, డిప్యూటీ మేయర్లు నిత్యానంద
రెడ్డి,ముంతాజ్ బేగం, ఇంచార్జి ఎస్. జమాల్ వల్లి, మార్కెట్ యార్డు వైస్
ఛైర్మన్ ఇబ్రహీం మియా, కార్పొరేటర్లు బాల స్వామి రెడ్డి,షఫీ,వై.కా.పా యువ
నాయకులు ఉమైర్,వైకాపా నాయకులు బంగారు నాగయ్య, డా. సోహైల్, హఫీజుల్లా,అప్జల్
ఖాన్,నారపురెడ్డి, సుబ్బారెడ్డి, ఎన్ఆర్ఐ తోట కృష్ణ,సుబాన్ బాషా, రెడ్డి
ప్రసాద్, గంగ రాజు, నాయకురాళ్లు టి.వి. సుబ్బమ్మ, కార్పొరేషన్ ల ఛైర్మన్ లు,
డైరెక్టర్లు, ఇతర నగర కార్పొరేటర్లు సభ్యులు, సచివాలయం సిబ్బంది,
వాలంటీర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.