అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు కులాల చుట్టూనే తిరుగుతున్నాయి.
సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. ఆ పట్టుదలతోనే అనేక రాజకీయ
వ్యూహాలను రూపొందించుకుంటూ ముందుకు వెళుతున్నాయి. అయినా అన్ని పార్టీలు
ఎన్నికల కంగారులోనే ఉన్నాయి. ఇప్పటి నుంచే ప్రధాన సామాజిక వర్గాలను ఆకట్టుకుని
తమ వైపునకు తిప్పుకుని గెలుపుకు ఎటువంటి డోఖా లేకుండా చేసుకోవాలనే పట్టుదలతో
ఉన్నాయి. ప్రస్తుతం అధికార పార్టీగా ఉన్న వైసీపీకి తెలుగుదేశం కంటే జనసేన భయం
ఎక్కువగా పట్టుకుంది.ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా వైసిపి ప్రభుత్వంపై
విరుచుకుపడుతున్నారు. అన్ని ప్రధాన సమస్యలను హైలెట్ చేస్తూ ప్రజల్లో వైసిపి
ప్రభుత్వం పై వ్యతిరేకత పెంచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఎక్కడికక్కడ
ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ, ప్రజలను చైతన్యవంతం చేస్తూ పార్టీ నాయకులు మరింత
యాక్టివ్ అయ్యేలా ప్రయత్నిస్తున్నారు. అంతే కాకుండా వైసిపి మళ్ళీ అధికారంలోకి
రాకుండా చేసేందుకు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు కూడా
సిద్ధమన్నట్లుగా పవన్ సంకేతాలు ఇచ్చారు. అయితే పవన్ ఎంతగా ప్రయత్నించినా కాపు
సామాజిక వర్గం పూర్తిగా పవన్ వైపు ఉండదని, మెజార్టీ కాపులు వైసీపీకి మద్దతుగా
నిలబడతారు అనే నమ్మకంతో జగన్ ఉంటూ వచ్చారు. అయితే కొద్ది రోజులుగా చోటు
చేసుకుంటున్న పరిణామాలు వైసిపికి వ్యతిరేకంగా మారాయి. ముఖ్యంగా వైసీపీలోని
కాపు సామాజిక వర్గం ప్రజా ప్రతినిధులు జనసేన వైపు చూస్తున్నట్లుగా జగన్ కు
నివేదికలు అందాయి. ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి ఎక్కువ వలసలు ఉండవచ్చు అనే
సంకేతాలు మరింత కంగారు పుట్టిస్తున్నాయి. అందుకే కాపు సామాజిక వర్గానికి తాము
ఎంతగా ప్రాధాన్యం ఇస్తున్నామనే విషయాన్ని జగన్ వైసిపి ఎమ్మెల్యేలు, ఆ పార్టీ
ప్రజాప్రతినిధుల ద్వారా చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు.అయినా ఆ సామాజికవర్గం
పవన్ వైపు ఉండే ఛాన్స్ ఉందన్న ఆలోచనలతో బీసీ ల ఓటు బ్యాంక్ ను పదిలం చేసుకునే
ప్రయత్నాల్లో జగన్ ఉన్నారు.
ఇటీవల కాలంలో పవన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటూ వైసీపీ నాయకులు పెద్ద
ఎత్తున విమర్శలు చేస్తున్నారు.తమ వర్గానికి చెందిన వ్యక్తి పై ఈ విధంగా
వ్యక్తిగత దాడి చేస్తుండడం రాజకీయాలకు అతీతంగా పవన్ కు మద్దతు లభిస్తుంది.
గతంతో పోలిస్తే పవన్ గ్రాఫ్ పెరిగినట్లు ఇంటిలిజెన్స్ రిపోర్టులు జగన్ కు
అందాయి. దీంతో కాపుల ఓట్లు తమకు దక్కవు అనే టెన్షన్ జగన్ పడుతుండగా, తనకు అదే
కలిసి వస్తుంది అనే ధీమాలో పవన్ ఉన్నారు. అదీ కాకుండా ప్రభుత్వ వ్యతిరేకత
తీవ్రంగా ఉందని, అన్ని వర్గాల ప్రజలను జగన్ పాలన పై అసంతృప్తి పెరిగిందని, అదే
తమకు కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు.