విజయవాడ : ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్ నుంచి రాష్ట్ర
వ్యాప్తంగా తీవ్రమైన ఆందోళన చేపడతామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం
రాష్ట్ర అధ్యక్షులు కె.ఆర్ సూర్యనారాయణ తెలిపారు. ఉద్యోగుల పట్ల వైసీపీ
ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఉద్యోగ సంఘ నేతలు నేడు ఏపీ గవర్నర్ ను కలిసి
వినతిపత్రం అందించారు.
ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ గత కొద్దికాలంగా ఉద్యోగులు,
ఉద్యోగసంఘాల నేతలు ప్రభుత్వానికి తమ వినతులు, డిమాండ్ల ద్వారా సమస్యలపై
స్పందించాలని కోరుతూ వస్తున్నారు. అయినా ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో
స్పష్టమైన విధానాన్ని ప్రభుత్వం చెప్పకపోవడంతో ఆందోళన చెందుతున్న ఉద్యోగులు తమ
సమస్యలపై స్పందించాలంటూ ఈ రోజు గవర్నర్ను కలిశారు. జీతాలకు సంబంధించి చట్టం
తీసువచ్చేందుకు ప్రయత్నించాలని కోరినట్లు వెల్లడించారు.
ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన ఆందోళన
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కరం కోసం ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా
తీవ్రమైన ఆందోళన చేపడతామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర
అధ్యక్షులు కె.ఆర్ సూర్యనారాయణ తెలిపారు. ఉద్యోగుల పట్ల వైసీపీ ప్రభుత్వం
వ్యవహరిస్తున్న తీరుపై ఉద్యోగ సంఘ నేతలు నేడు ఏపీ గవర్నర్ ను కలిసి వినతిపత్రం
అందించారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు
నిస్సహాయ స్థితిలో ఉన్నారని వాపోయారు. 90 వేలమంది ప్రభుత్వ ఉద్యోగుల అనుమతి
లేకుండా వారి ఖాతాల నుంచి ప్రభుత్వం డబ్బులు తీసుకుందని, ఇదేమని అడిగితే
తిరిగి ఇస్తామని చెపుతున్నారు తప్ప ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం తాను
ఏర్పాటు చేసిన నిబంధనలను ప్రభుత్వమే ఉల్లంఘిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్ధికశాఖ అధికారులు, మంత్రి వర్గ ఉప సంఘం, ప్రభుత్వ సలహాదారులకు అందరికి
ఉద్యోగుల సమస్యలు చెప్పామని వారు స్పందించకపోవడంతో తప్పని పరిస్థితుల్లో
గవర్నర్ని కలిసి ఫిర్యాదు చేశామన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల మధ్య నాలుగు
స్తంభాల ఆట నడుస్తోందన్నారు. ప్రభుత్వం స్పందించి ఉద్యోగుల సమస్యలు
పరిష్కరించే వరకు పోరాటం చేస్తామన్నారు.