అమరావతి : గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు వెంటనే చేపట్టాలని
ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు సంక్షేమ సంస్థ కోరింది. ఆంధ్ర
ప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ పక్షాన గురువారం గ్రామ
వాలంటీర్, వార్డు వాలంటీర్, విలేజ్ సెక్రటేరియట్ వార్డు సెక్రటేరియట్
డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ ని గురువారం వారి
కార్యాలయంలో కలిసి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు గత మూడేళ్ల కాలంగా బదిలీలు
లేకపోవడం వలన ఉద్యోగులు చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు.
ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా తక్షణమే సాధారణ బదిలీల అవకాశం
కల్పించాలని ఆంధ్ర ప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ సంఘ
పక్షాన వినతి పత్రం అందచేశారు.నోటిఫికేషన్ సమయంలో నాన్ లోకల్ జిల్లాలలో ఎక్కువ ఉద్యోగాలు నోటిఫై చేయడం వలన
అక్కడ పరీక్ష రాసి ఉద్యోగం పొందిన ఉద్యోగస్తులు ప్రతిరోజూ వందల కిలోమీటర్లు
దూరం ప్రయాణం చేస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారని, వారికి వెంటనే బదిలీల
అవకాశం కల్పించాలని కోరారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గ్రామ
వార్డు సచివాలయం ఉద్యోగస్తులకు వెంటనే బదిలీల అవకాశం కల్పించాలని, భర్త,
భార్య వేరు వేరు జిల్లాలో ఉద్యోగాలు చేస్తు వారు తల్లిదండ్రులకు పిల్లలకు
దూరంగా ఉంటూ మూడేళ్లుగా ఉద్యోగాలు చేస్తున్నారని, కారుణ్య నియామకాల్లో
ఉద్యోగం పొందిన వారి కోసం మానసిక, శారీరక అంగవైకల్యంతో బాధపడుతున్నటువంటి
పిల్లల తల్లితండ్రులకు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరికీ సాధారణ బదిలీలు
కల్పించాలని కోరారు.