కొవ్వూరు : కొవ్వూరు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో
భాగంగా 79 వ రోజు కొవ్వూరు టౌన్ లో హోం శాఖ మంత్రి డా.తానేటి వనిత
పర్యటించారు. కొవ్వూరు పట్టణం లోని 3వ వార్డ్ లో ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ
సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని హోంమంత్రి స్వయంగా అడిగి
తెలుసుకున్నారు. ఒక్కో కుటుంబానికి నాలుగయిదు సంక్షేమ పథకాలు అందుతున్నాయని
హోం మంత్రి స్పష్టంచేశారు. గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ కోసం వృద్ధులు అనేక
అవస్థలు పడేవారని గుర్తు చేశారు. కానీ సీఎం జగన్ పాలనలో సచివాలయ సిబ్బంది
ద్వారా నేరుగా ఇంటికి వద్దకే పెన్షన్, రేషన్ లాంటివి అందిస్తున్నారని
హోంమంత్రి తానేటి వనిత కొనియాడారు.