అమరావతి : ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఆ మహనీయుడికి టీడీపీ అధినేత చంద్రబాబు
నివాళులు అర్పించారు. మహానటుడు, ప్రజానాయకుడిగా ఎన్టీఆర్ చరిత్ర
సృష్టించారన్నారు. ప్రజాహిత పాలనకు, సంక్షేమ పథకాలకు ఎన్టీఆర్ ఆద్యుడు అని
పేర్కొన్నారు. జాతీయ రాజకీయాలకు ఎన్టీఆర్ సరికొత్త దిశా నిర్దేశం చేశారని
చంద్రబాబు తెలిపారు. సంక్షేమ పథకాలతో సమసమాజ స్థాపనకు ఎన్టీఆర్ బాటలు
వేశారన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు మనందరం కృషి చేద్దామని చంద్రబాబు
పేర్కొన్నారు.