విశాఖపట్నం : తెలుగు నేలపై ఎన్టీఆర్ ది చెరగని సంతకం అని, తెలుగువారి ఆత్మ
గౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పిన మహా వ్యక్తి ఎన్టీఆర్ అని ఎమ్యెల్యే
గంటా శ్రీనివాసరావు అన్నారు.బుధవారం విశాఖ టిడిపి కార్యాలయంలో ఎన్టీఆర్
వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన గంటా శ్రీనివాసరావు
మాట్లాడుతూ ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు ఇక వైబ్రేషన్. పార్టీని స్థాపించి 9
నెలలలోనే అధికారంలోకి వచ్చిన ఘనత ఎన్టీఆర్ దని, నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి
జాతీయ రాజకీయాల్లో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. పరిపాలనా
పరంగా ఎన్నో సంస్కరణలు తెచ్చిన ఘనత ఎన్టీఆర్ దే అని, రాబోయే రోజుల్లో టిడిపి
ఘన విజయాలు సాధిస్తుందన్నారు.
లోకేష్ పాదయాత్ర ఈ నెల 27 నుంచి ప్రారంభం అవుతుందని, 400 రోజులు..4 వేల
కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారని, 175 నియోజక వర్గాల్లో అన్ని ఏర్పాటు
జరుగుతున్నాయన్నారు. లోకేష్ యువగళం పాదయాత్ర సెన్సేషనల్ హిట్ అవుతుందని,
దేశానికి యువత వెన్నుముక..అలాంటి యువత రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు పడుతోందని,
అందుకే లోకేష్ పాదయాత్ర..ఇది విజయవంతం కావాలని కోరుకుంటున్నామని
పేర్కొన్నారు. టిడిపి ఆఫీసులో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో భాగంగా స్వర్గీయ
నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి టిడిపి నేతలు నివాళులు
అర్పించారు. టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, వెలగపూడి
రామకృష్ణ బాబు,ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ
పల్లా శ్రీనివాసరావు హాజరయ్యారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పార్టీ
కార్యాలయంలో రక్తదానం శిబిరం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విశాఖ పార్లమెంటరీ అధ్యక్షులు
పల్లా శ్రీనివాసరావు, తూర్పు శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు, పశ్చిమ
శాసనసభ్యులు పీవీజీర్ నాయుడు (గణబాబు ), ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, మాజీ
ఎమ్మెల్యే గండి బాబ్జీ, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ పిలా శ్రీనివాసరావు, విశాఖ
పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక
కార్యదర్శి సిహెచ్ పట్టాభిరామ్, చిక్కాల విజయ్ బాబు, రాజమండ్రి నారాయణ, పైల
ముత్యాల నాయుడు గోగినేని సాంబశివరావు, గొలగాని వీరారావు బుజ్జి విల్లురి
చక్రవర్తి, బొట్టా వెంకటరమణ, కాళ్ళ శంకర్ అక్కిరెడ్డి జగదీష్ నక్క కనకరాజు
ఈతలపాక సుజాత బొడ్డేపల్లి లలిత తమ్మిన విజయకుమార్ కోట నరేష్ వలిసెట్టి
తాతాజీ మోదీ అప్పారావు మేక సత్య కిరణ్, బుడుమూరి గోవింద్ అనసూరి మధు గణగళ్ల
సత్య బొట్టాపరదేశి యాదవ్,పొడుగు కుమార్, బండుబిల్లి సూర్యనారాయణ కోనేటి
సురేష్ తెడ్డిరాజు పలిశెట్టి అప్పన్న ఉరుకుటి గణేష్ ముల అప్పారావు, ఊరుకోటి
పైడ్రాజు ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.