నెల్లూరు : భాష ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలను గురించి వెంకయ్యనాయుడు ఎప్పుడూ
గుర్తు చేస్తుంటారని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు
నాగేశ్వరరావు అన్నారు. స్వర్ణ భారత్కు వచ్చిన స్కూల్ విద్యార్ధులు చక్కటి
తెలుగులో మాట్లాడుతున్నారని అభినందించారు. స్వర్ణ భారత్ ట్రస్టు ఆదర్శాలకు,
సాంప్రదాయాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని చెప్పారు. మానవ సంబంధాలు. సమాజ సేవ
వేదికగా స్వర్ణ భారత్ ట్రస్ట్ కొనసాగుతుందని, రాజకీయాలు ఇక్కడ మాట్లాడరని
రాష్ట్ర మంత్రి కాకాణి అన్నారు. అనేక చోట్ల చూస్తే సంస్కృతి సంప్రదాయ ఉత్సవాలు
ఉండటం లేదని అన్నారు. మానవ సంబంధాలు తగ్గాయని, ఇళ్లల్లో అందరూ టీవీల ముందు,
సెల్ ఫొన్ల ముందు కూర్చుంటున్నారని తెలిపారు. వెంకయ్యనాయుడు మాత్రం ట్రస్ట్
ద్వారా సేవ చేస్తున్నారని అభినందించారు.
జీవితంలో ప్రతి ఒక్కరికీ క్రమ శిక్షణ అవసరం.. మన పూర్వీకులు చూపించిన మార్గంలో
నడవండి. ఉత్సహంగా ఉల్లాసంగా ఉండండి. సంస్కృతి సంప్రదాయాలను పాటించండి…ఆటలు,
పాటలు, గాలి పటాలు , రైతుల పండుగ, పశువులు, పెద్దలను పూజించే పండుగ సంతోషాలతో
ఉండటమే సంక్రాంతి పండుగ అని పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆయన
రచనలు చూశాను.. వ్యాసాలను చూశాను ఆయన ఎప్పుడూ భాష ఆచారాలు సంస్కృతి
సాంప్రదాయాల గురించి గుర్తు చేస్తుంటారని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి
జస్టిస్ లావు నాగేశ్వరరావు పేర్కొన్నారు.