మచిలీపట్నం : బందరుపోర్టు నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ లభించింది. ఎంతోకాలంగా
ఎదురుచూస్తున్న పర్యావరణ అనుమతులకు ఆమో దం లభించింది. ఢిల్లీలో ఈఏసీ
ఎక్స్పర్ట్స్ అప్రైజల్ కమిటీ సమావేశం నిర్వహించారు. మంగళగిరిలోని ఏపీ
మేరిటైమ్ బోర్డు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఏపీ మేరీటైమ్
బోర్టు సెక్రటరీ షణ్ముగం, బందరు పోర్టు పనుల పర్యవేక్షణ ప్రత్యేక అధికారి
విద్యాశంకర్, పోర్టుకు పర్యావరణ అనుమతుల కోసం కసరత్తు చేసిన ఎస్వీ
ఎన్విరాన్మెంట్ సంస్థ, రైట్స్ సంస్థ ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.
అడిగిన ప్రశ్నలకు ఏపీ మేరిటైమ్ బోర్డు అధికారులు, రైట్స్ సంస్థ ప్రతి నిధులు
ఇచ్చిన సమాధానాలతో కేంద్ర కమిటీ సభ్యులు ఏకీభవించారు. బందరు పోర్టుకు పర్యా
వరణ అనుమతులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటిం చారు. సాధ్యమైనంత త్వరలో పోర్టుకు
పర్యావరణ అనుమతుల ఉత్తర్వులను జారీ చేస్తామని కేంద్ర కమిటీ సభ్యులు తెలిపారు.
ప్రధాని, కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు
బందరు పోర్టుకు పర్యావరణ అను మతులు మంజూరు చేసేందుకు అంగీకరించిన ప్రధాని
నరేంద్ర మోడీకి, కేంద్ర పర్యావరణ శాఖా మంత్రి భూపేంధర్సింగ్కు మచిలీపట్న
ఎంపీ వల్లభనేని బాలశౌరి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో బందరు పోర్టుకు పర్యావరణ
అనుమతులు ఇవ్వాలని భూపేంధర్ సింగ్‌ను కలిసి విన్నవించినట్లు ఎంపీ తెలిపారు.
దీంతో ఆయన కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక బృందాన్ని మచిలీపట్నానికి పంపి, ఈ
ప్రాంతాన్ని పరిశీలన చేయించారన్నారు. కేంద్రం బృందం నవంబరు 19, 20 తేదీల్లో
రెండు రోజుల పాటు పరిశీలన చేసిందన్నారు. పర్యావరణ అనుమతులు మం జూరు కావడంతో
బందరుపోర్టు పనులను త్వరలో ముఖ్య మంత్రి జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా
ప్రారంభిస్తామని ఎంపీ తెలిపారు. కృష్ణాజిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి
చెందడానికి బందరు పోర్టు దోహదపడుతుందని, వేలాది మందికి ప్రత్యక్షంగా,
పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభి స్తాయని ఎంపీ తెలిపారు. బందరు పోర్టుకు పర్యావరణ
అనుమతులు రావడానికి ముఖ్యమంత్రి జగన్ తనవంతు కృషి చేశారని, బందరుపోర్టు
నిర్మాణంలో తాను భాగస్వా మిగా ఉన్నందుకు ఆనందంగా ఉందని ఎంపీ బాలశౌరి
పేర్కొన్నారు.