అమరావతి : శ్రీకాకుళం జిల్లా, రణస్థలంలో జరిగిన యువశక్తి సభకు భారీ సంఖ్యలో
తరలివచ్చి విజయవంతం చేసిన యువతకు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉత్తరాంధ్ర
ప్రజానీకానికిజన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ప్రాంగణం ఇచ్చి సహకరించిన శ్రీకాంత్ కి, బందోబస్తు విధులను
నిర్వర్తించిన పోలీసు శాఖకు, ఎప్పటికప్పుడు వార్తా కథనాలు అందించిన మీడియా
వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సభ నిర్వహణలో పాలుపంచుకున్న ఉత్తరాంధ్ర
జిల్లాల నాయకులకు, డాక్టర్ విశ్వక్ సేన్, రాజేష్, సభకు పోలీసు అనుమతులు పొందిన
ఎన్ని రాజు, వైద్య సేవలు అందించిన డా. బొడ్డేపల్లి రఘు, ఇతర వైద్య బృందానికి
అభినందనలు తెలిపారు. పర్యటన సందర్భంగా చక్కటి ఆతిధ్యాన్ని ఇచ్చిన సన్ రే
రిసార్ట్ యాజమాన్యానికి, సిబ్బందికి, సభ విజయవంతం చేసిన కార్యక్రమాల నిర్వహణ
కమిటీ సభ్యులకు, కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన కమిటీల కన్వీనర్లు, జాయింట్
కన్వీనర్లు, సభ్యులకు, వీర మహిళలు, జన సైనికులకు, లీగల్ సెల్ సభ్యులకు
కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు.
ప్రచారకర్తలకు అభినందనలు
యువశక్తి కార్యక్రమానికి ఉత్తరాంధ్ర జిల్లాల్లోని అన్ని అసెంబ్లీ నియోజక
వర్గాల్లో విశేష ప్రచారం కల్పించిన పార్టీ ప్రచారకర్తలకు ప్రత్యేక అభినందనలు.
గత వారం రోజులుగా ఉత్తరాంధ్ర అంతటా పర్యటించి కార్యక్రమం పట్ల యువతకు అవగాహన
కల్పించడంలో పంతం నానాజీ, ముత్తా శశిధర్, పితాని బాలకృష్ణ, చిలకం మధుసూదన్
రెడ్డి, బోనబోయిన శ్రీనివాస యాదవ్, బొమ్మిడి నాయకర్, చిల్లపల్లి
శ్రీనివాసరావు, అక్కల రామ్మోహన రావు, శెట్టిబత్తుల రాజబాబు, బొలిశెట్టి
శ్రీనివాస్, రెడ్డి అప్పలనాయుడు, కిరణ్ రాయల్, చింతా సురేష్, నయుబ్ కమల్,
తాతంశెట్టి నాగేంద్ర, అమ్మిశెట్టి వాసు, వడ్రాణం మార్కండేయ బాబు, బేతపూడి
విజయ్ శేఖర్, తాడి మోహన్ కృషి చేశారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని సహకరించి,
బాధ్యతలు నిర్వర్తించిన వివిధ జిల్లాల నాయకులకి పవన్ కళ్యాణ్ అభినందనలు
తెలిపారు.