ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి
అమరావతి : రాష్ట్రంలోని అన్ని రకాల వాహనాలకు హెసెక్యూరిటీ నంబరు ప్లేట్లు
ఉండేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి రవాణాశాఖ
అధికారులను ఆదేశించారు.గురువారం అమరావతి సచివాలయంలో సిఎస్ అధ్యక్షతన రోడ్డు
సేప్టీ ఫండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది.ఈసందర్భంగా సిఎస్
మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా అన్ని రకాల వాహనాలకు తప్పని
సరిగా హైసెక్యురిటీ నంబరు ప్లేట్లు ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం
చేశారు.నూతన వాహనాలు కొనుగోలు చేసే వారికి ఆయా వాహనాల డీలర్లు ఈవిధంగా
హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లుతో వాటిని అందించేలా చూడాలని అన్నారు.అదే విధంగా
పాత వాహనదారులు కూడా ఒక నిర్ధిష్ట వ్యవధిలోగా హైసెక్యురిటీ నంబరు ప్లేట్లు
ఏర్పాటు చేసుకునేలా చూడాలని రవాణా శాఖ అధికారులను సిఎస్ ఆదేశించారు.దీనిపై
ప్రజల్లో అవగాహనకు వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని
సిఎస్ స్పష్టం చేశారు.వివిధ ప్రభుత్వ వాహనాలపై అధికారుల హోదాతో కూడిన నేమ్
బోర్డులు ఉంటున్నాయని ఆవిధంగా ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్దమని కేవలం
ప్రభుత్వ వాహనం అని మాత్రమే ఉండాలని దీనిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి తగిన
చర్యలు తీసుకోవాలని రవాణా,పోలీస్ శాఖలను సిఎస్ ఆదేశించారు. ప్రమాదాల నివారణ
చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని రవాణా,అద్దె వాహనాలు,
బస్సులు,ట్రాక్టర్లు,ట్రక్కులు వంటి వాహనాల వెనుక భాగంలో విధిగా రేడియం టేపు
అతికించి ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని రవాణా,పోలీస్ శాఖల అధికారులను
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి ఆదేశించారు.ప్రమాదాలు
జరిగేందుకు ఎక్కువ అవకాశాలున్న అన్ని ముఖ్య కూడళ్ళలో తప్పని సరిగా సిసి
కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ కేంద్రంతో అనుసంధానించాలని
రవాణా,పోలీస్ శాఖలను ఆదేశించారు.