వెలగపూడి సచివాలయం : ముఖ ఆధారిత హాజరు విధానం వల్ల ఉద్యోగులు ప్రధానంగా క్షేత్ర స్థాయిలో ఉన్న ఫీల్డ్ స్టాఫ్ కు ఉన్న ఇబ్బందులు, సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకుని వెళ్లిన ఏపీ జేఏసీ అమరావతి నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, వైవీ రావు తీసుకెళ్లారు. ఏపీ జేఏసీ అమరావతి పక్షాన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె యస్ జవహర్ రెడ్డి ని రాష్ట్ర సచివాలయం ఒకటవ బ్లాక్ లోని వారి కార్యాలయంలో కలసి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం జనవరి 1 వ తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ అమలు చేయాలని గత ఏడాది డిసెంబర్ 27న ప్రభుత్వం ఇచ్చిన జీవో 159 అమలు, పై ఉద్యోగుల్లో ఉన్న ఆందోళన, ముఖ ఆధారిత హాజరు వల్ల కలిగే ఇబ్బందులు, ప్రధానంగా క్షేత్ర స్థాయిలో ఉన్న ఫీల్డ్ స్టాఫ్ ఎదుర్కొనే సమస్యలు వివరిస్తూ ఏపీ జేఏసీ అమరావతి పక్షాన సిఎస్ కి వినతిపత్రం సమర్పించారు.
ముఖ ఆధారిత హాజరు విధానాన్ని స్వాగతిస్తున్నాము, కానీ ఈ విధానం అమలు వలన పర్సనల్ డేటా కు రక్షణ వుండదు అని ఉద్యోగులందరూ తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. అన్నీ శాఖలలో పనిచేసే ఉద్యోగుల్లో ఎక్కువ శాతం మంది చిరు ఉద్యోగులే. ప్రధానంగా నాల్గవ తరగతి ఉద్యోగులు, వాచ్మెన్, ఆర్టీసీ, రికార్డ్ అసిస్టెంట్ స్థాయి మెజారిటీ ఉద్యోగులకు స్మార్ట్ ఫోన్లు ఉండే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ వాళ్ల పిల్లలు ద్వారా వచ్చిన ఫోన్లు ఉన్నా, వాటిని ఉపయోగించడం తెలియదు కనుక ప్రభుత్వమే, ముఖ ఆధారిత హాజరు కొరకు ప్రత్యేకంగా డివైజ్లు, స్మార్ట్ ఫోన్లు ఏర్పాటు చేయాలని కోరారు.