విజయవాడ : చిరు వ్యాపారులకు రుణాలు మంజూరులో దేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించిందని,సున్నా వడ్డీ రుణాలు ఇవ్వడంలొ మొదటి స్థానంలో నిలిచిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 24.06 లక్షల మందికి రుణాలు మంజూరు కాగా ఇందులో ఏపీలోనే 15.31 లక్షలు మందికి మంజూరైనట్టు చెప్పారు. అరుదైన గాకర్స్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి హనీకి ముఖ్యమంత్రి సహాయంతో పునర్జన్మ లభించిందన్నారు. ఇప్పటికే హనీ వైద్యం కోసం రూ.1 కోటి
ముఖ్యమంత్రి మంజూరు చేశారని వెల్లడించారు.ఈ సందర్భంగా చిన్నారి హనీ తల్లీ దండ్రులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారని చెప్పారు. సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమలు దేశ ఉపాధి కల్పన మరియు అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. పెట్టుబడిదారులు ఈ పరిశ్రమలపై విశ్వాసం ఉంచి వారికి పని అప్పగిస్తున్న తీరు చూస్తే దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో చిన్న పరిశ్రమలు పెద్ద పరిశ్రమల కంటే తక్కువేమీ కాదన్నది స్పష్టమవుతోందని వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై అద్నాన్ సమీ చేసిన వ్యాఖ్యలలో స్పష్టమైన జ్ఞానం లేకపోవడం కనిపిస్తొందన్నారు. 2016కి ముందు అతను భారతీయ పౌరుడు కానందున అతనిని నిందించలేమని కౌంటర్ ఇచ్చారు. తెలుగు ప్రజలందరూ సహజంగానే దేశభక్తి కలిగి ఉంటారని ఎవరో సర్టిఫికేట్ అవసరం లేదని చెప్పారు.ఈ మేరకు పలు అంశాలపై సోషల్ మీడియా వేదికగా ఆయన గురువారం స్పందించారు.