గుంటూరు : స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకోవడం మనకు గర్వకారణమని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. యువతే దేశ భవిత అని నినదించిన యువగళం స్వామి వివేకానంద. భారతదేశ ఘనమైన చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మన దేశ కీర్తి పతాకం స్వామి వివేకానందని స్ఫూర్తిగా తీసుకుని దేశప్రగతికి, ప్రజాశ్రేయస్సుకి పాటుపడదామని పిలుపునిచ్చారు.