విజయవాడ : ‘యువత దేశానికి వెన్నెముక, వారు సాధించలేనిది ఏదీ లేదు’ అన్న స్వామి వివేకానంద మాటలను స్ఫూర్తిగా తీసుకుని లక్ష్య సాధనలో అంకిత భావంతో మనమందరం ముందడుగులు వేయాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. వివేకానందుని జయంతి సందర్భంగా గురువారం క్యాంప్ కార్యాలయంలో వివేకానందుని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంలో రాష్ట్ర యువతకు శుభాకాంక్షలు తెలిపారు.
యువజనోత్సవ సందర్భంగా యువత అందరికీ శుభాకాంక్షలు అని ట్వీట్ చేస్తూ సందేశం ఇచ్చారు.. సీఎం జగన్.