విజయవాడ : విజయవాడ రెవెన్యూ అసోసియేషన్ బిల్డింగ్ లో ఎన్. టీ. ఆర్. జిల్లా
నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ను అమరావతి జె. ఏ. సి.
చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంఘ
అధ్యక్షులు ఎస్. మల్లేశ్వరరావు మాట్లాడుతూ సకాలములో ప్రతి నెల ఒకటో తారీకునే
జీతాలు చెల్లించాలని, అలాగే ప్రభుత్వం ఉద్యోగులకు బకాయిపడ్డ మేము దాచుకున్న,
మాకు చట్టబద్దంగా రావాల్సిన జీత భత్యాలు తక్షణమే చెల్లించాలని, ఖాళీగా ఉన్న
నాల్గవ తరగతి ఉద్యోగుల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమం లో సిటీ జె. ఏ. సి. చైర్మెన్ కోసూరి సురేంద్ర, కృష్ణా జె. ఏ.
సి. చైర్మెన్ డి. ఈశ్వర్, రాష్ట్ర సంఘ నాల్గవ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం
కోశాధికారి శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షులు ఆదినారాయణ, కార్యవర్గ సభ్యులు
హాజరయ్యారు.