విజయవాడ : విజయవాడ సత్యనారాయణపురంలోని శ్రీ శారదాంబ మహిళా సహకార అర్బన్
బ్యాంక్ పాలకవర్గానికి ఎన్నికలు జనవరి 22న స్థానిక ప్రశాంతి మునిసిపల్
ఎలిమెంటరీ స్కూలు నందు జరుగుతాయని ఎన్నికల అధికారిగా నియమితులైన వైవి
కోటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. యన్.టి.ఆర్ జిల్లా కలెక్టరు, జిల్లా
ఎన్నికల అధారిటీ ఉత్తర్వుల మేరకు బుధవారం న ఫారం ఒకటి ఎన్నికల నోటీసు విడుదల
చేశారు. ఈనెల 13 న ఉదయం 10నుంచి సాయంత్రం 4గంటల వరకు అర్హులైన బ్యాంకు సభ్యుల
నుంచి నామినేషన్లను బ్యాంకు కార్యాలయంలో స్వీకరిస్తారు. స్వీకరించిన
నామినేషన్లను 14న ఉదయం 10 గంటల నుంచి పరిశీలిస్తారు. నామినేషన్ ఉపసంహరణ 15వ
తేదీ సాయంత్రం 5 గంటల వరకు అనుమతిస్తారు. పోటీ ఉన్నట్లయితే 22న ఎన్నికలు
స్థానిక ప్రశాంతి మునిసిపల్ ఎలిమెంటర్ స్కూలు నందు ఉదయం 7 గంటల నుంచి
మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతాయని, ఎన్నికల ఫలితాలు అదే రోజు ఓట్ల లెక్కింపు
అంనంతరం ప్రకరిస్తామని ఎన్నికల అధికారి తెలిపారు. పోటీ లేనట్లయితే ఎన్నికల
ఫలితాలను 15న నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ప్రకటిస్తారు. అర్హులైన ఓటర్ల జాబితా
బ్యాంకు నోటిసు బోర్డు నందు ప్రచురించామని, కావలసిన వారు బ్యాంకు పని వేళలలో
చూసుకోవచ్చని, ఇతర వివరాలకు తనను కానీ,బ్యాంకు సి.ఇ.ఓ.ను కానీ బ్యాంకు
పనివేళలలో సంప్రదించవచ్చని తెలిపారు. ఎన్నికైన పాలక వర్గం అయిదు
సంవత్సరాలపాటు అధికారంలో ఉంటుందని, ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల 1964
చట్టాన్ని అనుసరించి జరుగుతాయని ఎన్నికల అధికారి వై. వి. కోటేశ్వరరావు
తెలిపారు.