అమరావతి : ఎస్సీ కార్పొరేషన్ నిధులను ఏపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని
రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి ఆర్. డి విల్సన్ దుయ్యబట్టారు. ఎస్సీ
కార్పొరేషన్‌ను ఏపీ సర్కార్ నిర్వీర్యం చేస్తున్న తీరు, ప్రభుత్వ విధానాలపై
మూడున్నర ఏళ్లుగా తాము గళం విప్పుతూనే ఉన్నామని విల్సన్ గుర్తుచేశారు.
అయినప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి కదలికా లేదని ఆయన తప్పుబట్టారు. రాష్ట్రంలో
దళిత ప్రజాప్రతినిధులు ద్రోహులుగా మారారని, ఎస్సీ కార్పొరేషన్‌కు నిధులు
కేటాయించక పోగా కేంద్రం నుంచి వచ్చే నిధులను దుర్వినియోగం చేస్తున్నారని
విమర్శించారు. కార్పొరేషన్‌కు నిధులు కేటాయించపోవడంతో హైకోర్టు కూడా
ప్రభుత్వాన్ని తప్పుబట్టిందని విల్సన్ గుర్తుచేశారు. నవరత్నాల అమలు కోసం
దళితుల నిధులను వాడుకోవడం దారుణమన్నారు.నిధులు కేంద్రం నుండి వస్తున్నాయని, మోడీ ద్వారా అందే ఈ నిధులు డైవర్ట్ చేసి
ప్రధాని దగ్గరకు వెళ్లి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి కొంగ జపం చేస్తున్నారని
ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్. సి కార్పోరేషన్ కి నిధులు కేటాయించక పోగా కేంద్రం
ఇచ్చే నిధులు కూడా డైవర్ట్ చేస్తుంటే దళిత నేతలు మౌనంగా ఉంటే నెక్స్ట్ జనరేషన్
మనల్ని క్షమించదన్నారు. హైకోర్టు కూడా తీవ్ర మైన వ్యాఖ్యలు చేసిందని నిధులు
కేటాయించనప్పుడు ఇక కార్పొరేషన్ ఎందుకు మూసేయ్ మని చెప్పిందని అన్నారు.
నవరత్నాల అమలు కు దళితుల నిధులు వాడడం దారుణం అన్నారు. రాబొయ్యే రోజుల్లో
బీజేపీ అన్ని జిల్లాల్లో స్పష్ట మైన కార్యాచరణకు సిద్ధం అవుతుందన్నారు.ఈ
మేరకు బీజేపీ శ్రేణులు సంసిద్ధులు కావాలన్నారు. దళితులు వీధి పోరాటాలకు సైతం
సిద్ధం కావాలన్నారు. ఇది మన బిడ్డల భవిష్యత్తు అని, . భూమి కొనుగోలు పథకం,
ఆటోలు,ఇన్నోవా, ట్రాక్టర్స్, పండ్ల తోటల పెంపకం, మోటార్ల పంపిణీ, బోరుబావులు
ఏర్పాటు, బ్యాంకు తో నిమిత్తం లేని నేరుగా అందే రుణాలు, కంప్యూటర్, నర్సింగ్,
డ్రైవింగ్ వంటి ఎన్నో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కార్పొరేషన్ ద్వారా అందుతాయనీ,
తాను చైర్మన్ గా పని చేసిన కాలంలో కోట్లాది రూపాయలు ఇచ్చానన్నారు. ఇప్పుడు
ఏర్పడ్డ చైర్మన్ లు ఇవ్వలేక పోతున్నారంటే అది రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గానికి
పరాకాష్ట అని, ఇక ఉపేక్షించకూడదు అన్నారు.