అమరావతి : మాజీ మంత్రి నారాయణకు చెందిన సంస్థలో ఏపీ సీఐడీ సోదాలు చేపట్టింది.
మాదాపూర్‌లోని ఎన్ఎస్పీఐఆర్ఏ సంస్థలో సీఐడీ అధికారులు తనిఖీలు
నిర్వహించారు. నారాయణ సంస్థల నుంచి రామకృష్ణ హౌసింగ్ సంస్థలోకి నిధులు
మళ్లినట్లు గుర్తించారు. ఈ డబ్బులతో నారాయణ బినామీల పేర్లతో అమరావతిలో చట్ట
విరుద్ధంగా అసైన్డ్ భూములు కొనుగోలు చేశాడన్న ఆరోపణలపై సీఐడీ అధికారులు
సోదాలు జరిపారు.
మాజీమంత్రి నారాయణ కంపెనీలో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు చేశారు.
మాదాపూర్‌లోని సంస్థలో సీఐడీ తనిఖీలు చేసింది. రామకృష్ణ హౌసింగ్ సంస్థలోకి
నిధులు మళ్లించినట్లు నారాయణపై ఆరోపణలు వచ్చాయి. ఈ డబ్బులతో బినామీల పేర్లపై
అమరావతిలో నారాయణ అసైన్డ్ భూములు కొన్నట్లు ఆరోపణలు వచ్చాయి. 2020లో నమోదైన
రాజధాని అసైన్డ్ భూముల కేసులో సీఐడీ సోదాలు నిర్వహించింది. 2020లో ఎఫ్ఐఆర్
నెంబర్ 14, 15/2020 పేరిట కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో ముందస్తు నారాయణ
బెయిల్ తీసుకున్నారు. రాజధాని ప్రాంతంలో 1,100 ఎకరాల అసైన్డ్ భూముల అక్రమాలు
జరిగాయని అందులో 169 ఎకరాల అసైన్డ్ భూములు కొనుగోలు, లావాదేవీలపై సీబీఐ కేసు
నమోదు చేసింది. మాజీ మంత్రి నారాయణ బంధువులు, పరిచయస్తుల పేర్లతో ఈ భూముల
రిజిస్ట్రేషన్ జరిగిందని సీబీఐ ఆరోపిస్తోంది. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం
పెదపాలెం గ్రామానికి చెందిన వై.ప్రసాద్ కుమార్ ఫిర్యాదు మేరకు అవినీతి
నిరోధక చట్టం 13(1)తోపాటు ఐపీసీలోని 409, 420, 506, రెడ్ విత్ 120(బి) తదితర
సెక్షన్ల కింద మంగళగిరిలోని సీఐడీ హెడ్ క్వార్టర్స్‌లో పలువురిపై కేసు నమోదు
చేశారు.