విజయవాడ : సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ వార్షిక దినోత్సవం సందర్భంగా ఇండ్ల
అగస్త్యకు రెండు గోల్డ్ మెడల్స్ అందజేశారు. 10వ తరగతిలో ‘బెస్ట్ ఔట్ గోయింగ్
స్టూడెంట్ బాయ్’గా కనుమిల్లి సుబ్బారావు మెమోరియల్ గోల్డ్ మెడల్ మరియు 6వ
తరగతి నుండి 10వ తరగతి వరకు అన్నిరంగాలలో ప్రతిభ కనబర్చినందుకు పర్వతనేని
సుభాష్‌చంద్రబోస్ మెమోరియల్ గోల్డ్ మెడల్ ‘బెస్ట్ అల్ రౌండర్ బాయ్’ గోల్డ్
మెడల్ ను ముఖ్యఅతిధి ఇన్ కం టాక్స్ చీఫ్ కమిషనర్ అనిల్ కుమార్ గారి
చేతులమీదుగా అందజేశారు. విజయవాడకు చెందిన ప్రముఖ మానసిక వైద్యుడు డాక్టర్
ఇండ్ల విశాల్, డాక్టర్ స్వప్న దంపతుల కుమారుడైన ఇండ్ల అగస్త్యను ఈ సందర్భంగా
పలువురు వైద్యులు, పుర ప్రముఖులు అభినందించారు. ఈకార్యక్రమంలో సిద్ధార్థ
అకాడమీ ప్రతినిధులు సూరెడ్డి విష్ణు, మలినేని రాజయ్య, చదవలవాడ నాగేశ్వరరావు,
లలితప్రసాద్, స్కూలు ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.